ఇప్పటి యూత్‌కు ఆమె పేరు చెబితే చాలు...ఆమె ఆడే ఆట పేరు చెప్పేస్తారు. టెన్నిస్ అనగానే ముందుగా ఆమె పేరే గుర్తుకువస్తుంది. క్రికెట్‌ను వెర్రిగా చూసే యూత్ ఆమె రాకతో టెన్నిస్ వీరాభిమానులుగా మారిపోయారనేది అక్షరసత్యం. వివాదాలతో ఆడుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. ఇప్పుడు సరికొత్తగా పాక్ క్రికెటర్ షోయబ్‌మాలిక్‌తో కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధం అవుతోంది సానియా...ఆటలో డబుల్స్ ఆడినా ఫరవాలేదు కానీ...జీవితంలోనూ ఆమె డబుల్స్ ఆడి వార్తల్లోకెక్కింది....ఈ వారం వార్తల్లో వ్యక్తిగా చోటు సంపాదించింది సానియా మీర్జా..
సానియా ఫ్యామిలీ ముంబాయి నుండి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. ఫాద ర్ ఇమ్రాన్ వృత్తి రీత్యా స్పోర్ట్‌స జర్నలిస్ట్ కావడంతో...స్పోర్ట్‌స పట్ల మక్కువతో సానియాకు చిన్నప్పటి నుంచి బ్యాట్మింటన్ ఆటలో తర్ఫీదునిప్పించేవాడు.
కూతురిని గొప్పగా చూడాలని...కేవలం ఆరవ సంవత్సరం నుంచే సానియా బ్యా ట్ చేతిలో పట్టుకుని ముద్దుముద్దుగా షాట్లు కొ డుతుంటే ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొట్టేవాడు. అక్కడితో సరిపెట్టలేదు. తన కూతురిని గొప్ప పొజిషన్‌లో చూసుకోవాలనుకున్నాడు. అందుకే అప్పటికే భారత్ తరపున బ్యాట్మింటన్ లో మంచి పొజిషన్‌లో ఉన్న మహేష్ భూపతి తండ్రి కృష్ణభూపతిని అతి కష్టం మీద ఒప్పించి సానియాకు కోచ్‌గా ఉండవల్సిందిగా అభ్యర్థిం చాడు. అంతే భూపతి కోచ్ పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఎదిగి నేడు ప్రపంచ స్థాయి టెన్నిస్ క్రీడాకారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
ఆమె ప్రోత్సాహమే లేకుంటే...
హైదరాబాద్‌లోని నాజర్ స్కూల్‌లో టెన్త్ క్లాస్ 63 శాతం మార్కులతో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సా దించింది. ఒక పక్క స్కూల్లో స్టడీస్‌ను కొనసాగిస్తూనే...జూనియర్ స్థాయి టోర్నమెంట్స్‌లో పా ల్గొనేది. తనను తల్లితండ్రులు ఎంతగానో ప్రోత్సహించేవారని..స్కూల్ హెడ్‌మిసెస్ కూడా ఎంతగానో ప్రోత్సహించేదని...ఆమె ప్రోత్సాహమే లేకుంటే ఈనాడు ఇంత ఉన్నత స్థితి లో నేను నిలబడేదానిని కాదేమోనం టుంది సానియా.
సచిన్ నా రోల్ మోడల్...
చిన్నప్పటి నుంచి సచిన్‌నే నా రోల్ మోడల్‌గా మలుచుకున్నాను. ఆడే ప్రతి ఆటా కూడా ప్రతిష్టాత్మకంగా ఆడేదానిని. హార్డ్ వర్క్ చేసేదానిని.
డాక్టర్ అవుదామని...
మొదట్లో చిన్నప్పుడు డాక్టర్‌గా ఈ సమాజానికి సేవచేయాలనే కాంక్ష బలంగా ఉండేది. తర్వాత ఐఎఎస్ చదివి కలెక్టర్ అవ్వాలని కూడా అనుకున్నాను. అయితే విచిత్రంగా ఈ రెండూ కాకుం డా టెన్నిస్ క్రీడాకారిణి అయ్యాను.
హైదరాబాద్ అంటే ఇష్టం...అందుకే హైదరాబాద్‌తో నా అ నుబంధం విడదీయరానిది. ఇక్కడి బిర్యానీ అం టే నాకు ప్రాణం. హైదరాబాద్ తర్వాత నాకు బాగా నచ్చిన సిటీ జైపూర్.
ప్రతిష్టను పెంచిన పద్మశ్రీ
35 దేశాలు తిరిగాను. అనేక సార్లు లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకున్నాను. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే 2004 సంవత్సరంలో క్రీడారంగంలో అత్యున్నత అవార్డు అయిన అర్జున అవార్డును అందుకోవడం నా జీవితంలో మరపురాని రోజు. అలాగే 2006 సంవత్సరం భారత ప్రభుత్వం తరపున ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకోవడం నాకు మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది.
దినచర్య
రోజుకు మూడు గంటలు ఫిట్‌నెస్ ప్రాక్టీస్ చేస్తాను. దాంతో పాటే రోజూ చేసే అన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటాను. వారానికి మూడు లేక నాల్గు సార్లు జిమ్‌కు కూడా వెళుతుంటాను. ఎక్కువగా జ్యూస్‌లు తాగుతాను. మేము ఆడే ఆటే ఒక ఎక్సరసైజ్‌లాంటిది. అయినా నా వంతు నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను.
మరో రెండేళ్లలో రిటైర్...
షోయబ్ నాకు 5 సంవత్సరాలుగా పరిచయం. ఇంట్లో పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లయ్యాక దుబాయ్‌లో సెటిల్ అవుతాం. ఇంకా ఒలింపిక్స్ టెన్నిస్ 2012లో ఆడిన తర్వాత సంసార జీవితాన్ని ఆరంభిస్తాను. ఈ రెండేళ్లూ కూడా భారత్ తరపునే ఆడతాను. పాకిస్తాన్ నా మెట్టినిల్లు అయితే...భారతదేశం నా పుట్టినిల్లు...ఈ దేశం మీద నాకు ఎన్నటికీ తరిగిపోని అభిమానం ఉం టుంది.
పర్సనల్
పేరు : సానియా మీర్జా
పుట్టిన తేదీ : 15-11-1986, ముంబాయి
తండ్రి : ఇమ్రాన్‌మిర్జా
తల్లి : నసీమా
సిస్టర్ : ఆనమ్
వెయిట్ : 59 కె.జి
హైట్ : 1.53 మీటర్లు
అవార్డ్‌స : పద్మశ్రీ, అర్జున
గుర్తింపు : టెన్నిస్ క్రీడాకారిణి