సెబీ, ఐఆర్‌డీఏల తాత్కాలిక రాజీ యులిప్ కథ తాత్కాలికంగానైనా సుఖాంతమైంది. ఆర్థిక శాఖ జోక్యంతో పాలసీదార్లకు, బీమా కంపెనీలకు వూరట లభించింది. కోర్టులోనే వివాదాన్ని తేల్చుకోవడానికి సెబీ, ఐఆర్‌డీఏలు అంగీకరించడంతో పాటు 14 బీమా కంపెనీలపై సెబీ నిషేధం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంతో ఇది సాధ్యమైంది.
ఫలించిన ఆర్థిక శాఖ జోక్యం
14 కంపెనీలపై నిషేధం ఎత్తివేత
పాలసీలు నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు
బీమా కంపెనీలకూ ఉపశమనం
పాలసీదార్లకూ వూరట

హైకోర్టుకు..?: ఏ కోర్టుకు వెళ్లొచ్చన్న విషయంపై ఆర్థిక కార్యదర్శి అశోక్ చావ్లాను ప్రశ్నించగా.. 'హైకోర్టుకు వెళ్లొచ్చని నేను భావిస్తున్నా'నన్నారు. కాగా, ఐఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండగా.. సెబీ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.
అసలేం జరిగిందంటే: యులిప్‌ల ద్వారా నిధులను సమీకరించే విషయంలో తమ అనుమతిని తీసుకోలేదని పేర్కొంటూ 14 బీమా కంపెనీలపై శుక్రవారం రాత్రిసెబీ నిషేధం విధించింది. ఆ జాబితాలో ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, టాటా ఏఐజీ, ఏగాన్ రెలిగేర్ లైఫ్, అవైవా లైఫ్, బజాజ్ అలియంజ్, భారతీ యాక్సా, బిర్లా సన్‌లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్, ఐఎన్‌జీ వైశ్యా లైఫ్, కోటక్ మహీంద్రా ఓల్డ్ మ్యూచువల్ లైఫ్, మాక్స్ న్యూయార్క్ లైఫ్, మెట్‌లైఫ్ ఇండియా, రిలయన్స్ లైఫ్‌లున్నాయి. ఆ తర్వాతి రోజే(శనివారం) సెబీ ఉత్తర్వును పట్టించుకోనక్కర్లేదనీ.. యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చనీ బీమా చట్టం సెక్షన్ 34(1)ను ఉటంకిస్తూ బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ సూచించింది. దీంతో ఆ రెండు నియంత్రణ సంస్థల మధ్య అగ్గిరాజుకుంది. ఈ మొత్తం విషయం ఆర్థిక శాఖ దృష్టిలో పడడంతో.. భావే, హరినారాయణ్‌లతో ఆర్థిక కార్యదర్శి అశోక్ చావ్లా విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. దాని ఫలితమే ప్రణబ్ ప్రకటన.
పెట్టుబడులు సురక్షితమే: 'యులిప్‌లలో పెట్టుబడులు పెట్టిన మదుపుదార్ల నగదు సురక్షితంగా ఉంది. వారి క్లెయిమ్‌లు, ఉత్పత్తులు పూర్తి భద్రంగా ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేద'ని ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయం బయట విలేకర్లతో ఐఆర్‌డీఏ ఛైర్మన్ జె. హరినారాయణ్ పేర్కొన్నారు. అశోక్ చావ్లాతో సమావేశానికి ముందు ఆయన మాట్లాడారు. 'ఏదో నిర్ణయం తెలపడానికి నేనిక్కడకు రాలేదు. సమస్యను మా కోణం నుంచి చెప్పడానికి వచ్చా. యులిప్ ఉత్పత్తులపై సెబీకి న్యాయాధికారం లేదు. కానీ సెబీ అలా భావిస్తోంద'ని అన్నారు. సెబీ నిర్ణయం పాలసీదార్లపై, బీమా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అంతక్రితం పేర్కొన్న సంగతి తెలిసిందే.
పారిశ్రామిక వృద్ధి గణనకు పరిగణనలోకి తీసుకునే విభాగాల్లో 14 మెరుగైన పనితీరును కనబరిచినప్పటికీ సిమెంట్, స్టీలు రంగాలు నిరుత్సాహకరంగా ఉండటం వృద్ధి రేటును ప్రభావితం చేసింది. కిందటేడాది కేవలం 0.2 శాతం వృద్ధితో సరిపెట్టుకున్న తయారీ రంగం ఈ ఏడాది ఇదే నెలలో అనూహ్యరీతిలో 16 శాతం పురోగతి సాధించింది. అలాగే వినియోగ వస్తువుల తయారీ ఫిబ్రవరిలో 29.9%, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి 44.4% పెరిగాయి. తవ్వక రంగం 12.2%, విద్యుత్తు రంగం 6.7% వృద్ధిని నమోదు చేశాయి. మొత్తంమీద గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి నెలల మధ్య పారిశ్రామికోత్పత్తి సూచీ 10.1% వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 3% మాత్రమే.
జీడీపీ 7.2శాతానికి తగ్గదు: నిపుణులు
మౌలిక రంగంలోని 6 కీలక విభాగాలు జనవరి (9.4%) కంటే ఫిబ్రవరిలో (4.5%) తక్కువ పురోగతి సాధించడం పారిశ్రామికోత్పత్తిపై ప్రభావం చూపిందని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త డి.కె. జోషి తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక విధానాలను కఠినతరం చేయడం వల్ల రాబోయే నెలల్లో ఐఐపీ మరింత తగ్గవచ్చు. అయినప్పటికీ 2009-10లో జీడీపీ 7.2% వృద్ధి సాధించవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారీ యంత్ర పరికరాలు, తయారీ రంగం పారిశ్రామిక వృద్ధికి దోహద పడ్డాయని, పెట్టుబడులకు తగినట్లు వినియోగం పెరిగినప్పుడే వృద్ధి స్థిరపడుతుందని యెస్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త సుభదారావ్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం పనితీరు మెరుగ్గా ఉన్నందున, ఉద్దీపనల ఉపసంహరణ దిశగా కేంద్రం సాగుతుందని వివరించారు.