Wednesday, April 7, 2010

స్ధిరత్వాన్ని కోరుకుంటున్న కార్పొరేట్‌ ఉద్యోగులు

న్యూఢిల్లీ : దేశీయ కార్పొరేట్‌ రంగ ఉద్యోగుల వైఖరి మారింది. మాంద్య పరిస్థితుల తరువాత ఇప్పుడంతా స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ రంగంలో తిరిగి ఉద్యోగాల నియామకాలు జోరందుకున్నా, స్థిరత్వం ద్వారానే ఆర్థిక ప్రగతి పొందవచ్చనే భావన ఉద్యోగుల్లో బలంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2008 తరువాత మళ్ళీ మొదలైన కొత్త ఉద్యోగాల పరంపర, వీరిలో ఉత్సాన్నిచ్చినా, ఉద్యోగ మార్పు విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు ఉద్యోగుల్లో నిజాయితీను, విశ్వాసాన్ని మరింత పెంచాయనీ, ఇప్పుడు వీరిలో సానుకూల వైఖరి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందనీ ప్లానమ్‌ మానవ వనరుల కన్సల్టన్సీ సంస్థ ఎండీ దీపక్‌ కైశ్‌తా తెలిపారు. పరిస్థితులు మారుతుండటంతో ఆ ర్షనీయమైన అవకాశాలు బోలెడు వచ్చినా, ఉద్యోగులు ప్రస్తుతం ఒకే సంస్థలో స్థిరంగా పనిచేయడానికే మొగ్గు చూపుతున్నారనీ తెలిపారు.


అధిక వేతనాలు గల స్థిరమైన ఉద్యోగాలకే యువత ఓటు వేస్తోందని, ఇక మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారని ఎస్‌బీఐ ఛీఫ్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. మాంద్య పరిస్థితులతో భయం నెలకొన్నందున ప్రభుత్వ ఉద్యోగాలను స్థిరత్వం కొరకై కోరుకుం టున్నారనీ అన్నారు. అయితే ఒకసారి దేశ బహుళజాతి సంస్థలన్నీ కూడా నియామకాల్లో వేగం పెంచితే మళ్ళీ పరిస్థితులు తారుమారవుతాయని అన్నారు. ఉద్యోగ మేళ్లాలో వేగమైన వృద్ధి నమోదైతే, కొత్త ఉద్యోగాలు మారడం సహజమనీ పేర్కొన్నారు. ఈ విధంగా మళ్ళీ ఉద్యోగుల్లో మార్పు రావచ్చనీ జెకె ఆర్గనైజేషన్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ హెచ్‌ఆర్‌) ప్రకాశ్‌ వి భైద్‌ తెలిపారు.

ప్రతిభగల ఉద్యోగులు ఎప్పుడూ మెరుగైన అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారనీ అన్నారు. దేశ సంస్థల్లో నియామకాల వృద్ధి మరింత వేగవంతమౌతుందనీ, ముఖ్యంగా టెలికాం, బీమా రంగాల్లో త్వరలో వృద్ది నమోదవుతుందనీ పేర్కొన్నారు. తాజాగా గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ చేపట్టిన సర్వే ఆధారంగా 36 శాతం దేశ ఉద్యోగులు మాంద్య పరిస్థితుల తరువాత మరింత విశ్వాసంతో పనిచేస్తున్నారనీ వె ల్లడించింది. మరో వైపు ఉద్యోగుల విశ్వసనీయత ఆయా సంస్థల స్టాఫ్‌ పాలసీలపై ఆధారపడి ఉంటుందనీ గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ సంస్థ డీహెచ్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ చాఛీ పేర్కొన్నారు. సంస్థల ఉద్యోగుల వ్యక్తిగత నిర్ణయంపై కూడా ఈ విషయాలు ఆధారపడి ఉంటాయనీ తెలిపారు.