ఇం దు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం లీటరుకు రూ.10 సబ్సిడీ కూ డా ఇచ్చేది. అయితే ప్రస్తుతం ఈ రంగ పరిస్థితులు మారాయి. కేజీ చక్కెర ధర రూ.25-26లకు పడిపోవడంతో పాటు టన్ను మోలాసెస్ ధరలు కూడా రూ.3,200-3,300గా ఉన్నాయి. పది రోజుల క్రితం ఇం తకన్నా కనిష్ఠంగా మోలాసెస్ ధర టన్నుకు 2,500గా కూడా పలికింది. ఆల్క హాల్ ఉత్పత్తిదారులు వాడే డీ-నాచురేటెడ్ స్పిరిట్ ధర కూడా రూ. 20-21లీటర్‌గా పడిపోయింది.
‘బేర్’ సెంటిమెంట్..:
ఈ రంగంలో బేర్ సెంటిమెంట్ కారణంగా ప్రస్తుతం వెంటనే కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, భవిష్యత్‌లో ఈ ధరలు మరింత పడవచ్చే కారణాలు కూడా ఇందుకు అనేకమనీ ముంబాయిలోని మోలాసెస్ అండ్ ఆల్కహాల్ కన్సల్టన్సీ సంస్థ అధికారి గౌతమ్ శర్మా అన్నారు.
దేశంలోని ఉత్తర భారత్‌లో ప్రస్తుతం మోలాస్ ధరలు రూ.2,500 - 3,000లుగా టన్నుకు పలుకుతుండగా స్పిరిట్ ధర లీటరుకు రూ. 23- 24లుగా ఉంది. గరిష్ఠంగా మోలాసెస్ ధరలు 3,500-4,000 రూ పాయలు గా టన్నుకు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతులపై నియమా లను పెట్టడంతో పాటు దేశ లిక్కర్ యూనిట్లకు 30శాతం మిల్లులు తమ ఉత్పత్తిని ేటాయించాలనే నిబంధన కారణంగా ఈ పరిస్థితి కనిపి స్తోంది. ఈ తాజా పరిస్థితులు కేవలం ఆల్కహాల్ సంబంధిత ఉత్పత్తిదారులకు మాత్రమే లాభదాయకంగా మారనున్నాయి. మన దేశంలో గల గ్లైకాల్స్ లిమిటెడ్ (ఐజీఎల్), జుబిలెంట్ ఆర్గనోసిస్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు ఈ కోవలోకే వస్తాయి. ఈ సంస్థలన్నీ కూడా ఇప్పటి వరకూ తక్కువ సామర్థ్యంతోనే కార్యకాపాలను సాగిస్తున్నాయి.
దిగుమతి అవుతున్న స్పిరిట్స్..:
గత 2008-09 సంవత్సర కాలం అక్టోబరు-సెప్టెండరు మాసాల మధ్య ఆల్కహాల్ సంబంధిత కెమికల్ యూనిట్లు 35కోట్ల లీటర్ల డీనేచర్డ్ హైడ్రస్ స్పిరిట్‌ను, 100కోట్లకు పైగా డి మాండ్‌ను చేరుకునే క్రమంలో దిగుమతి చేయాల్సి ఉండగా, టన్నుకు 500 డాలర్లుగా దిగుమతులు నమోదయ్యాయి. ( ఒక టన్ను అంటే 1,240 లీటర్లు) ఆ తరువాత 2009-10 సీజన్‌లో అసలు దిగుమతులే నమోదు కాలే దు. డిసెంబరు-జనవరి కాలంలో దిగుమతుల ధరలు టన్నుకు 800-850 డాలర్లు పలుకుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కానీ మళ్లీ అంత ర్జాతీయ ముడి చక్కెర ధరలు 30 నుండి 17 సెంట్ల ప్రతి పౌండ్‌కు పడిపోవ డంతో గత రెండు మాసాలుగా ఎలాంటి దిగుమతులు నమోదవలేదు.
ఈ ఏడాది మే-జూన్ మాసాల్లో కూడా టన్నుకు 600-610 డాలర్లుగా ధరలు ఉండబోతున్నాయి. అయితే ప్రపంచ అతిపెద్ద ఆల్కహాల్ ది గుమతిదారు దేశ మైన అమెరికా ఇందుకు భిన్నంగా ఎగుమతిదారు పాత్ర వహిస్తుండటే ఇప్పటి విశేషమనీ ఐజీఎల్ సంస్థ సీఈఓ రాకేష్ భార్‌తియా తెలిపారు. ఈ కారణం గానే అంతర్జాతీయంగా చక్కెర ధరలు తగ్గుముఖం పడుతున్నాయనీ అన్నారు. 600 డాలర్ల టన్ను ధరతో దిగుమతి చేయబడ్డ స్పిరిట్‌ను రూ.22 లీటర్‌కు నిర్ణయించే పరిస్థితి ఉందనీ పేర్కొన్నారు.
ఉత్పత్తి పెరగవచ్చు...:
ప్రస్తుత దేశీయ చక్కెర మిల్లులు 150మిలియన్ టన్నుల (ఎంటీ) చెరకు ఈ సీజన్‌లో నష్టపోబోతున్నాయని సమాచారం. దీని ద్వారా వచ్చే మోలాసెస్ ఉత్పత్తి 6.3ఎంటీల్లో రోజుకు 4.2 శాతంతో తిరిగి పుంజుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 180ఎంటీల చెరకు పడిపోవ డంతో, ఉత్పత్తి శాతం 7.6ఎంటీలకు చేరుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఉత్పత్తుల్లో 20 శాతం వరకూ ఇతర ప్రత్యామ్నాయ పరిశ్రమలైన జంతు ఆహా ర సంస్థలకు తరలించినా, మిగతా 6ఎంటీలు దేశీయ డిస్టిలరీలకు అందు బాటులో ఉంటాయి.
Wednesday, April 7, 2010
కష్టాల్లో చక్కెర మిల్లులు
న్యూఢిల్లీ : గత నెల అంత ర్జాతీయంగా చక్కెర ధరలు పడి పోవడంతో ఈ రంగ మిల్లులకు కష్టకాలం ఎదురవుతోంది. దీని కి తోడు మోలాసెస్ ధరలు కూడా చక్కెర మిల్లులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్టల్రో జనవరి నుండి ఫిబ్ర వరి మాసాల మధ్య సుమారు 10 చక్కెర మిల్లులు మోలాసెస్ ధరలను రూ.5,200-5,600గా విక్రయించాయి. తద్వారా ఆ ల్కహాల్ మందును తయారు చేసి లీటరుకు రూ.25-26గా నిర్ణయించాయి. ఒకప్పుడు చెరకు ఫ్యాక్టరీలు తమ ధరలను కేజీకు రూ.40 ఆపై నిర్ణయించేవి, దీంతో ధాన్యా ల నుండి లిక్కర్‌ను అతి తక్కువ ధరకు ఉత్పత్తి చేసేవారు.