Monday, April 12, 2010

వారెవ్వా.. ఐపీఎల్‌

రూ.19000 కోట్ల బ్రాండ్‌!
బెట్టింగులూ, బీమా ఎక్కువే
ప్రచార వ్యయమే అధికం
క్రికెట్‌ హీరోలు.. సినీస్టార్లు.. వ్యాపార దిగ్గజాలు.. అందరినీ ఒకే వేదికపైకి తెచ్చిన టోర్నీ ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌). ఇది పరుగుల వరదే కాదు.. కాసుల వర్షాన్నీ కురిపిస్తోంది. రెండేళ్ల క్రితం వూపిరి పోసుకున్న ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ, ప్రస్తుత మూడో టోర్నీకి రూ.19000 కోట్లకు చేరిందని అంచనా. ఐపీఎల్‌-2లో ఈ మొత్తం రూ.9000 కోట్లు మాత్రమే.

పిడుగుల్లాంటి సిక్సర్లతో గత నెల రోజులుగా ప్రేక్షకులను మైమరిపిస్తున్న ఐపీఎల్‌ టోర్నీ ప్రస్తుతం రసవత్తర స్థాయికి చేరుకుంది. క్రీడాభిమానులకు ఇదో పండగలాంటిది. అందుకే వ్యాపార సంస్థలు ఈసారి 90 కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు దీన్ని వేదికగా చేసుకున్నాయి. ఇందుకు రూ.1500-1600 కోట్లకు పైనే వెచ్చిస్తున్నాయి.

ఐపీఎల్‌ 2లో లాభ నష్టాలు
డెక్కన్‌ ఛార్జర్స్‌
యాజమాన్యం: డెక్కన్‌ ఛార్జర్జ్‌ స్పోర్టింగ్‌ వెంచర్స్‌ (డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ పూర్తి అనుబంధ సంస్థ)
స్పాన్సర్స్‌: ప్యూమా, కోకాకోలా, బూమర్‌, కింగ్‌ఫిషర్‌, మెక్‌డోవెల్స్‌
ఆదాయం: రూ.57.8 కోట్లు
ఖర్చు: రూ.76 కోట్లు
నష్టం: 18.20 కోట్లు
రాయల్‌ ఛాలెంజర్స్‌, బెంగళూరు
యాజమాన్యం: యూబీ గ్రూపు
స్పాన్సర్స్‌: రాయల్‌ ఛాలెంజ్‌, మెక్‌డోవెల్స్‌, బ్యాగ్‌పైపర్‌, వైట్‌ అండ్‌ మ్యాక్‌, కింగ్‌ఫిషర్‌, రీబాక్‌.
ఆదాయం: రూ.65.9 కోట్లు
ఖర్చు: రూ.86 కోట్లు
నష్టం: 20.10 కోట్లు
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
యాజమాన్యం: ప్రీతీ జింటా, నెస్‌ వాడియా, మోహిత్‌ బర్‌మాన్‌
స్పాన్సర్స్‌: ఎమిరేట్స్‌, మౌంటెన్‌ డ్యూ, ఏసీసీ సిమెంట్‌, గల్ఫ్‌, వర్ల్‌పూల్‌, రీబాక్‌, రాయల్‌ ఛాలెంజ్‌, అరోమా మొబైల్స్‌, వ్రిగ్లీస్‌ ఆర్బిట్‌
ఆదాయం: రూ.59.3 కోట్లు
ఖర్చు: రూ.61 కోట్లు; నష్టం: రూ.1.70 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌
యాజమాన్యం: షారూక్‌ఖాన్‌, జుహీచావ్లా, జై మెహతా
స్పాన్సర్‌లు: నోకియా, రిబాక్‌, వీడియోకాన్‌ డీ2హెచ్‌, స్ప్రైట్‌, నెక్ట్స్‌, మెక్‌డోవెల్స్‌, ఎస్‌జీ ఎనర్జీ డ్రింక్‌, టాగ్‌ హూవర్‌
ఆదాయం: రూ.80.4 కోట్లు
ఖర్చు: రూ.70 కోట్లు;
లాభం: రూ.10.4 కోట్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌
యాజమాన్యం: జీఎంఆర్‌ హోల్డింగ్స్‌
స్పాన్సర్స్‌: కోకకోలా, పానసోనిక్‌, రెలిగేర్‌, ఐడియా, హీరోహోండా, కింగ్‌ఫిషర్‌, అడిడాస్‌, ఫ్త్లెయింగ్‌ మెషీన్‌, ఫీవర్‌ 104 ఎఫ్‌ఎమ్‌,వ్రిగ్లీస్‌ ఆర్బిట్‌, సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌
ఆదాయం: రూ.84.2 కోట్లు
ఖర్చు: రూ.82 కోట్లు
లాభం: రూ.2.20 కోట్లు
ముంబయి ఇండియన్స్‌
యాజమాన్యం: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
స్పాన్సర్స్‌: మాస్టర్‌ కార్డ్‌, వీడియోకాన్‌, కింగ్‌ఫిషర్‌, రాయల్‌స్టాగ్‌, పెప్సీ, అడిడాస్‌, వ్రిగ్లీస్‌ ఆర్బిట్‌, బూమర్‌, బుక్‌మైషో.కామ్‌
ఆదాయం: రూ.73.50 కోట్లు
ఖర్చు: రూ.94 కోట్లు
నష్టం: రూ.20.50 కోట్లు
రాజస్థాన్‌ రాయల్స్‌
యజమాన్యం: మనోజ్‌ బదాలే, శిల్పాషెట్టి, రాజ్‌ కుందార్‌, లచ్‌లాన్‌ మర్దోక్‌, ఆదిత్య ఎస్‌ చల్లారామ్‌, సురేష్‌ చల్లారామ్‌
స్పాన్సర్స్‌: అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మూవ్‌, టీసీఎస్‌, ప్యూమా, కింగ్‌ఫిషర్‌, వ్రిగ్లీస్‌, సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌
ఆదాయం: రూ.79.2 కోట్లు
ఖర్చు: రూ.64 కోట్లు; లాభం: రూ.15.20 కోట్లు
చెన్నై సూపర్‌కింగ్స్‌
యాజమాన్యం: ఇండియా సిమెంట్స్‌
స్పాన్సర్స్‌: ఎయిర్‌సెల్‌, రిబాక్‌, మెమొరీ వీటా, 7 అప్‌, కోరమాండల్‌ ఇన్ఫోటెక్‌, ఆర్బిట్‌, పీటర్‌ ఇంగ్లాండ్‌, డీఎల్‌ఎఫ్‌, యాహూ, ఓరియెంట్‌, యూనివర్‌సెల్‌
ఆదాయం: రూ.67.2 కోట్లు
ఖర్చు: రూ.76 కోట్లు; నష్టం: రూ.8.8 కోట్లు
ఇదీ సత్తా
* ప్రారంభ వేడుకల ఖర్చు రూ.10-15 కోట్లు
* మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల్లో 10 సెకన్ల యాడ్‌కు ప్రస్తుతం రూ.4-5 లక్షలు;
* సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌కు (చివరి 15 మ్యాచ్‌లు) ఇది రూ.8-10 లక్షలు
* ఐపీఎల్‌-1కు స్టేడియంలో టికెట్‌ ధర రూ.500 నుంచి రూ.1500.
* ఐపీఎల్‌-3లో రూ.220 (డిస్కౌంట్‌తో) నుంచి రూ.5500 అయ్యింది.
* ప్రత్యేక సీట్లకు రూ.లక్ష నుంచి రూ.1.93 లక్షలు
* ఐపీఎల్‌-3 ప్రైజ్‌మనీ రూ.20 కోట్లు. విజేతకు రూ.8 కోట్లు, మిగలిన మొత్తాన్ని ఇతర జట్లుకు పంచుతారు.
ఐపీఎల్‌ ఆదాయ వనరులు
* ప్రసార హక్కుల వేలం
* టైటిల్‌, కార్పొరేట్‌ స్పాన్సర్‌షిప్‌లు
* టిక్కెట్ల అమ్మకపు ఆదాయం
* ఫ్రాంచైజీల వేలంతో వచ్చే ఆదాయం
* అధికారిక అంపైర్‌ల స్పాన్సర్‌ షిప్‌లు
రూ.7000 కోట్లకు బీమా
ఐపీఎల్‌ నిలిచిపోయినా, నష్టపోకుండా టోర్నీకి రూ.7000 కోట్లతో బీమా. మ్యాచ్‌ రద్దయితే రూ.5 కోట్లు, సెమీ ఫైనల్‌, ఫైనల్‌ రద్దయితే రూ.5.5-6 కోట్ల మేర పరిహారం పొందేలా 6 జట్లకు బీమా

ఒక్కో ఆటగాడి అత్యవసర చికిత్సకు రూ.45.52 లక్షల బీమా
సచిన్‌కు రూ.8 కోట్లు, పోలార్డ్‌కు రూ.15 కోట్లకు ప్రత్యేక బీమా. 33 మంది అంపైర్లకూ బీమా రక్షణ
విజేతకు అందించే డీఎల్‌ఎఫ్‌ ట్రోఫీకీ రూ.47 లక్షల బీమా

ఐపీఎల్‌ వ్యయాలు
* ఫ్రాంచైజీలకు ప్రసార, స్పాన్సర్‌షిప్‌, టిక్కెట్ల ఆదాయాన్ని పంపిణీ చేయడం
* ప్రారంభ, ముగింపు వేడుకలు
* బహుమతులు
ఇంత మొత్తాలు!
అధికారిక, అనధికారిక వ్యాపారాలు.. రూ.10,000 కోట్లు
ఫ్రాంచైజీల మొత్తం విలువ రూ.1,542 కోట్లు

పదేళ్లలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)కు రూ.7,300 కోట్ల ఆదాయం. తొలి పదేళ్ల ఆదాయంలో 40% ఐపీఎల్‌కు, 54% ఫ్రాంచైజీలకు, 6% ప్రైజ్‌మనీ కింద చెల్లిస్తారు.

ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.200 కోట్ల ఆదాయం
నాలుగో అంచెలో మరో రెండు ఫ్రాంచైజీలు పుణె, కోచి జట్లకు అవకాశం కల్పిస్తూ నిర్వహించిన వేలంలో రూ.3235 కోట్ల ఆదాయం

భారీ బెట్టింగులు: 60 మ్యాచ్‌లపై బెట్టింగ్‌ల రూపంలోనే రూ.6000-8,000 కోట్లు చేతులు మారుతున్నాయని అంచనా. ఒక్కో మ్యాచ్‌కు రూ.60 కోట్ల నుంచి రూ.120 కోట్ల మధ్య ఉంటున్నాయి.

ప్రకటనలకు ఇన్ని కంపెనీలు
మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సెట్‌మ్యాక్స్‌కు ప్రకటనలపై రూ.750 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కో స్పాన్సర్లు వొడాఫోన్‌, వీడియోకాన్‌ రూ.50-55 కోట్ల చొప్పున; 9 అసోసియేట్‌ స్పాన్సర్లు పెప్సి, శామ్‌సంగ్‌, ఎల్‌జీ, గోద్రేజ్‌, హెచ్‌యుఎల్‌, ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, హ్యుందాయ్‌ వంటివి రూ.35-40 కోట్ల చొప్పున చెల్లిస్తాయని అంచనా.

* గ్రౌండ్‌ స్పాన్సర్లు సిటీ బ్యాంక్‌, హీరో హోండా, కింగ్‌ ఫిషర్‌, పెప్సీ వంటివి ఐపీఎల్‌-1 సమయంలోనే ఏడాదికి రూ.30 కోట్ల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయి. మ్యాక్స్‌ మొబైల్‌ వంటి కొత్త స్పాన్సర్లు వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించవచ్చని అంచనా.