Thursday, April 1, 2010

ఏక పత్రంలో ఎఫ్‌డీఐ విధానాలు

న్యూఢిల్లీ: మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విధానాలన్నింటినీ ప్రభుత్వం ఒక పూర్తి స్థాయి ఏక పత్రంలోకి తీసుకొచ్చింది. ఇందులో మొత్తం 178 నోట్లు ఉన్నట్లు సమాచారం. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్‌ శర్మ ఈ పత్రాన్ని ఆవిష్కరించారు. 'పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాల విభాగం(డీఐపీపీ) ప్రతీ ఆరు నెలలకూ మార్పులన్నిటినీ అందులో జోడిస్తుంద'ని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడుదార్లకూ ఈ విభాగం చేయూతనందించగలదని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త విధానంతో విదేశీ పెట్టుబడుదార్లకు భారత్‌పై మరింత విశ్వాసాన్ని పెరుగుతుందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. మొత్తం ఎఫ్‌డీఐ విధానాల్లో పారదర్శకతను తీసుకురావడానికి ఏకీకృత పత్రాన్ని తీసుకొస్తామని బడ్జెట్‌ సమయంలో ప్రణబ్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.