కార్పొరేట్ రంగ నేరాలు దేశంలో కొత్తకాదు. ఒకప్పుడు హర్హద్ మెహ్‌తా, కేతన్ పరేఖ్ వంటి ’బిగ్ బుల్స్’ ఈ విషయంలో పేరు మోసిన వారే..! ఇక్కడ గమనిం చదగ్గ విషయం ఒకటుంది. చరిత్రలో కలిసిన వైట్‌కాలర్ నేరాల్లో మెహతా, పరేఖ్ కేసును విచారించిన సీబీఐ స్వల్పకాలంలోనే వారికి కస్టడీ నుండి విము క్తుల్ని చేయగలిగింది. ఇక విదేశాల్లో చూస్తే, అమెరికాకు చెందిన గలియాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రాజ్ రాజారత్నం, చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద హెడ్జ్ ఫండ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసు విచారణను అక్కడి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) చేపట్టింది. అంతపెద్ద ఎత్తున బయటపడ్డ కుంభకోణ సూత్రధారి రాజారత్నంను కేవలం రెండు రోజుల్లో బెయిల్‌పై విడుదల చేశారు.
తన వ్యక్తిగత పూచీకత్తుపై సుమా రు 100మిలియన్ డాలర్ల బాండ్ షరతుపై రత్నంకు బెయిల్ మంజూరు చేశా రు. ఈ వ్యవహారంలో తన న్యాయవాదులు కూడా ’పెద్ద’ ఎత్తునే కృషి చేసి విడుదల చేయించారు. మరి సత్యం రామలింగరాజు విషయాన్నే చూస్తే, ఇక్కడి మెజిస్ట్రేట్ కోర్టు నుండి మొదలు రాష్ట్ర హై కోర్టు, సుప్రీమ్ కోర్టు కూడా రాజు బెయిల్ పిటిషన్లను కొట్టివేశాయి. ఈ విషయంపై పలువురు కార్పొరేట్ రంగ నిపుణులు న్యాయపరమైన ప్రక్రియ వేగవంతం కావాలని కోరుతున్నారు. ఈ విషయంలో రామలింగరాజు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా అవకాశాన్ని ఇవ్వాలనీ తెలిపారు. అంతర్జాతీయంగా పూర్తిగా తన ఖ్యాతిని కోల్పోయిన సత్యం సంస్థ వ్యవహారం పూర్తి భిన్నంగా కొనసాగుతుందని ఫిక్కీ అధికారులు అంటున్నారు.
ఈ కేసులో న్యాయకోణం ముందుకు రావాలనీ, అసలేం జరి గింది, ఈ కుంభకోణంలో తెర వెనుకే ఉండిపోయిన వ్యక్తులను బయటకు తీసుకురావాలని కోరారు. సత్యం కుంభకోణంలో నిధుల మళ్ళింపుపై ఇంకా విచారణ కొనసాగుతుందని సీబీఐ చెబుతోంది. ఏప్రిల్ 7, 2009లో కైసు ఫైల్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు మొత్తం రెండు అదనపు సప్లిమెంటరీ చార్చ్‌షీట్‌లు దాఖలైనా, ఎందులోనూ నిధుల మళ్ళింపు విషయం పేర్కొనలేదు. అతిపెద్ద వైట్‌కాలర్ కేసుగా దీన్ని పరిగణిస్తూ, పూర్తి స్థాయిలో విచారణ అవస రమని సీబీఐ కౌన్సిల్ బి రవీంద్రనాథ్ అన్నారు. ఇప్పటికే 800 మంది సాక్ష్యాధా రాలను తీసుకున్నట్టు, 1,60,000 పేజీల డాక్యుమెంట్ సాక్ష్యాలను సేకరిం చినట్టు తెలిపారు. వీటికి అదనంగా మరో 100 కంప్యూటర్లను, సాఫ్ట్‌వేర్‌లను ఫైల్ చేశారనీ అన్నారు. 800 మంది సాక్ష్యులను విచారించాలంటే 800 రోజు ల సమయం పడుతుందనీ నిపుణులు అంటున్నారు. ఈ 800 రికార్డులను కోర్టు రికార్డు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
దీంతో పాటు క్రాస్ ఎగ్జామింగ్ విచారణకు 10 మందిని విచారిస్తున్నారని, ఒక్కోరికీ ఒక్క రోజు చొప్పున విచారణ సమయం పడుతుందనీ అన్నారు. కోర్టులకు వారానికి ఐదు పనిదినాలు కావడం, ఇతర పబ్లిక్ హాలిడేలతో కలుపు కుని సంవత్సరంలో మొత్తం 225రోజులు పనివేళలు ఉంటాయి. అంటే ఈ ేసులో ఒక్క క్రాస్ ఎగ్జామింగ్‌కు అక్షరాల నాలుగు సంవత్సరాల సమయం పడుతుందంటే ఆశ్చర్యమే..!
ప్రస్తుతం రామలింగరాజు ఆరోగ్య కారణాల వల్ల నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరారు. తనను తాను బలంగా కోర్టులో సమర్థించు కోవాలంటే రామలింగరాజు ముందుగా 160000 పేజీల డాక్యు మెంట్లను చద వాలి.
రాజు న్యాయవాది ప్రకారం, ఒక్కో డ్యాకుమెంట్ చదవటానికి కనీసం 5నిమిషాల సమయం పడుతుంది. ఈ రకంగా గణాంకాలు వేసుకుంటే, మొత్తం 13,333 గంటల సమయాని రామలింగరాజు కేవలం డాక్యుమెంట్లను చదవడానికి వెచ్చించాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 10గంటల సమయం తీసుకున్నా, మొత్తం 1,333రోజులు పడుతుంది. అంటే కనీసం మూడు సంవత్సరాల సమయం. ఈ కేసును వేగవంతం చేయాలంటే ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక కోర్టును కల్పిస్తే నాలుగు సంవత్సరాల కన్నా ముందుగానే ఈ కేసుకు పూర్తి చేయవచ్చు. నిమ్స్ వైద్యుల ప్రకారం ప్రస్తుతం రామలింగరాజు పరిస్థతి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. 56సంవత్సరాల వయసుగల రామలింగరాజు కుంభకోణ వ్యవహారం సంతృప్తికరంగా ముగియాలంటే ప్రభుత్వ చొరవ తప్పనిసరి అనేది సుస్పష్టం.
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ఇప్పుడు జగమెరిగిన ఉదం తం. కార్పొరేట్ రంగంలో వైట్ కాలర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతాయనే దానికి నిలువెత్తు ఉదాహరణ ఈ-వ్యవహారం. 2009 సంవత్సరం జనవరి మాసంలో వెలుగులోకి వచ్చి అందరినీ నివ్వెరపరచిన ఈ కుంభకోణం కథ ఇంతవరకూ ఓ కొలిక్కి రాలేదు. కార్పొరేట్ రంగ చరిత్రలోనే సుదీర్ఘకాల జైలు జీవితం గడిపిన అపఖ్యాతిని సత్యం రామలింగరాజు మూటగట్టుకున్నారు. సుమారు 15మాసాలుగా ’సాగుతూ’ వస్తున్న ఈ కుంభకోణం విచారణ ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దేశ వైట్‌కాలర్ నేరాల్లో అత్యంత పెద్దదిగా భావిస్తూ ఈ కేసు విచారణ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగించారు.