Monday, April 5, 2010

'నవ్వు' రత్న


బాధ్యత
వెంకటేశ్‌ ఇంటర్వ్యూకు వెళ్లాడు. పదిమంది అయ్యాక అతన్ని పిలిచారు.
వెంకటేశ్‌: గుడ్‌మార్నింగ్‌ సర్‌!
ఆఫీసర్‌: గుడ్‌ మార్నింగ్‌ యంగ్‌మేన్‌.. కమాన్‌. ముందుగా నీకు చెప్పేది ఏమిటంటే.. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తికే ఈ పోస్ట్‌ ఇవ్వాలన్నది మా ఉద్దేశం.

వెంకటేశ్‌: అయితే ఈ ఉద్యోగానికి కచ్చితంగా సరిపోతాను సర్‌!
ఆఫీసర్‌: ఎలా...?

వెంకటేశ్‌: నేను గతంలో పనిచేసిన ఆఫీసులో ఏ చిన్న తప్పు జరిగినా.. అంతా నన్నే బాధ్యుడ్ని చేసేవారండీ...!
ఆఫీసర్‌: ఆ..!


నమ్మకస్తుడు
సురేశ్‌: సర్‌, మీ బ్యాంకులో రాజు అని తెల్లగా, ఎత్తుగా ఉంటాడు. గిరజాల జుట్టు కూడా ఉంటుంది. ఒక్కసారి అతన్ని పిలిపిస్తారా?
బ్యాంక్‌ మేనేజర్‌: ఎందుకు..?

సురేశ్‌: ఏం లేదు సర్‌.. ఇన్వెస్ట్‌మెంట్స్‌ గురించి మాట్లాడాలి. నమ్మకస్తులైతే మంచిది కదా అని.
మేనేజర్‌: ఆహా.. అలాగా..! మీరు చెబుతున్నట్లు చాలా నమ్మకస్తుడు. అతని కోసమే వెతుకుతున్నాం. కనబడగానే కబురు చేస్తాం లెండి.