Monday, April 5, 2010

బిజినెస్‌ గారడీలు

* ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు
అమెరికాలో మాంద్యం వచ్చి ఇండియాలో పర్సనల్‌ లోన్‌లు ఆగిపోయినట్లు.

* దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డాడు
బాస్‌ ప్రమోషన్‌ ఇచ్చినా.. కింది ఆఫీసరు కిరికిరి పెట్టినట్లు.

* కడివెడంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే అన్నట్లు
బ్లూచిప్‌ కంపెనీ అయినా సెబీకి తలవొగ్గాలన్నట్లు

* మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె
బీఏ పాస్‌ కాలేదు కాని.. ఎంబీఏ చేస్తానన్నాట్ట.

* అరచేతిలో స్వర్గం చూపించడం
బ్రోచర్‌ చూపించి టౌన్‌షిప్‌ కట్టించడం.