గత ఆరేళ్ల నుంచి విశాఖ మన్యం కాఫీ ఫైన్ కప్ అవార్డును సాధిస్తున్నది. ఈసారి కూడా తమకు ఫైన్ కప్ అవార్డుతో పాటు అంతర్జాతీయ జ్యూరీ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉన్నదని విశాఖ గ్రూప్ మేనేజర్ ఏఎన్ గురుమూర్తి గురువారం ఇక్కడ 'ఆన్‌లైన్'కు తెలిపారు.
గత ఏడాది అంతర్జాతీయ జ్యూరీ అవార్డు దక్కించుకున్న టాటా కాఫీకి నూటికి 83.6 మార్కులు రాగా, రెండవ స్థానంలో నిలిచిన అనంతగిరి కాఫీకి 83 మార్కులు దక్కాయి. కేవలం 0.6 మార్కుల తేడాతో గత ఏడాది కోల్పోయిన అవార్డును ఈసారి దక్కించుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మిరియాలతో లాభాలు
కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను సాగు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఇటీవలె ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కాఫీ దిగుబడి తగ్గినా మిరియాలు మాత్రం బాగా వచ్చాయని ఆయన తెలిపారు. 2007-08లో 55 మెట్రిక్ టన్నులు, 2008-09లో 55 మెట్రిక్ టన్నులు దిగుబడి రాగా 2009-10లో మాత్రం 120 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో గణనీయమైన వృద్ధి కనిపించిందని గురుమూర్తి తెలిపారు.
Friday, April 16, 2010
అంతర్జాతీయ జ్యూరీకి మన్యం కాఫీ ఈ సారీ ఫైన్ కప్ మనకే?
విశాఖపట్నం)ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) విశాఖ ఏజెన్సీలో పండిస్తున్న కాఫీ ఈ ఏడాది అంతర్జాతీయ జ్యూరీకి ఎంపికైంది. రీజియన్, నేషనల్ స్థాయిలను దాటి అంతర్జాతీయ జ్యూరీ పరిశీలనకు వెళ్లిన 16 ఉత్పత్తుల్లో విశాఖ 'అరబికా' కాఫీ కూడా ఉండటం విశేషం. ఈ నెల 13న ముగిసిన ఈ పోటీల ఫలితాలు పదిహేను రోజుల్లో వెలువడతాయి.