Thursday, April 1, 2010

ఎయిర్‌టెల్ షేరు కొనవచ్చా...

భారతి ఎయిర్‌టెల్ 1000 కోట్ల డాలర్లతో కువైట్ టెలికాం కంపెనీ జెయిన్- ఆఫ్రికా వ్యాపారాన్ని కొనుగోలు చేసిన నేప«థ్యంలో ఈ కంపెనీ షేరు విలువ ఏరూటు తీసుకుంటుందన్న అంశంపై మార్కెట్ వర్గాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాయి.


భారతి షేరుకు దీర్ఘకాలంలో ఢోకా ఉండదని అధిక శాతం మంది మార్కెట్ ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే సమీప భవిష్యత్‌లో హెచ్చుతగ్గులు తప్పవని వారంటున్నారు. భారతి ఎయిర్‌టెల్ షేరు 350-370 రూపాయిల స్థాయిలో ఉండాలి, అయితే జెన్ డీల్‌తో 300 స్థాయిలోనే ఊగిసలాడుతోంది. ఇంతకంటే తగ్గే అవకాశం లేదని ఏంజిల్ బ్రోకింగ్ కంపెనీ ఎనలిస్టు ఫణి శేఖర్ పేర్కొంటున్నారు.

భారతి దేశీయ వ్యాపారం ద్వారా వచ్చే రెండు సంవత్సరాల్లో 20-25 వేల కోట్ల రూపాయలు ఆర్జించే అవకాశం ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే జెన్ కొనుగోలుకు చేసిన రుణాన్ని భారతి వచ్చే మూడు నాలుగేళ్లలో తీర్చేయవచ్చు. ఈ దృష్ట్యా దీర్ఘకాలంలో జెన్ కొనుగోలు డీల్ భారతి ఎయిర్‌టెల్‌కు బాగా కలసి వస్తుందని శేఖర్ అంటున్నారు.

ఇక టెక్నికల్స్ పరంగా చూస్తే భారతి షేరు 280 రేంజ్‌కి తగ్గితే కొనుగోలు చేయవచ్చునని, ర్యాలీ ఏర్పడితే 340 రూపాయలు వరకు పెరిగితే ప్రస్తుతానికి అమ్ముకుని లాభాలు చేసుకోవచ్చునని టెక్నికల్ ఎనలిస్ట్ అశ్వని గుజ్రాల్ చెబుతున్నారు.

రేటు ఎక్కువే
భారతి ఎయిర్‌టెల్ జెన్ డీల్‌కు మరీ ఎక్కువ రేటు పెట్టిందని, ఆఫ్రికాలో భారీ ఎత్తున టెలికాం వ్యాపారాన్ని పెంచుకుంటేగానీ వర్కౌట్ కాదని ఎనలిస్ల్ వివేక్ గుప్తా అంటున్నారు. అయితే ఈ డీల్‌తో భారతీ ఆర్పూ (యావరేజ్ రెవిన్యూ పర్ యూసర్) బాగా పెరుగుతుందని కెపిఎంజి టెలికాం హెడ్ రోమల్ షెట్టి పేర్కొంటున్నారు.

జెన్ కొనుగోలు వ్యూహాత్మకమైనదే కానీ రేటు కొంత ఎక్కువగానే ఉందన్నది ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ సంజయ్ చావ్లా అభిప్రాయం. నోమురా ఇంటర్నేషనల్ టెలికాం ఎనలిస్ట్ మార్టిన్ మబూట్ ఆఫ్రికాలోని లాభదాయక టెలికం సర్వీసులన్నింటినీ అఫ్రికన్లే నిర్వహిస్తున్నారు.