Thursday, April 1, 2010

జైన్‌తో భారతీ ఒప్పందం ఖరారు

న్యూఢిల్లీ: జైన్‌ ఆఫ్రికా సంస్థ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ మంగళవారం ప్రకటించింది. జైన్‌ ఆఫ్రికా కంపెనీ విలువ 10.7 బిలియన్‌ డాలర్లు (రూ.49,220 కోట్లు) అని భారతీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియతో ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో భారతీ కార్యకలాపాలు విస్తరిస్తాయి. జైన్‌ కొనుగోలు తర్వాత భారతీ ఎయిర్‌టెల్‌కు 17.90 కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం 180 కోట్ల మందిని కవర్‌చేయగలుగుతుంది. సింగ్‌టెల్‌ మద్దతు కారణంగా ఈ ఘనత సాధించగలిగామని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యానించారు.