దేశం మొత్తం మీద నూతన ఉద్యోగాల నియామకాలు అహ్మదాబాద్, పూణెలలో పతాక స్థాయిలో ఉంటాయని, కాగా హైదారాబాద్‌లో అతి తక్కువ స్థాయిలో ఉంటాయని ఎప్లాయ్‌మెంట్ సర్వేలో తేలిసట్లు మాఫాయ్ పేర్కొంది. అహ్మదాబాద్‌లో ఉత్పత్తుల రంగం, బిజినెస్ సర్వీసెస్, మీడియా, ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్లలో భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరిగే అవకాశం ఉందని తెలిపింది. ముంబై-పూణెల మధ్య రవాణా వ్యవస్థ బాగా మెరుగుపడటంతో ఆ నగరంలో కూడా భారీ స్థాయిలో నియాకమాలు ఉంటాయని స్పష్టం చేసింది.
కాగా హైదరాదాబాద్ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నియామకాలు అతితక్కువ స్థాయిలో ఉండవచ్చునని అంచనా వేస్తోంది. రాజకీయ అనిశ్చితి కారణంగా అనేక కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేశాయని, ఐటి, మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్‌స్ట్రక్షన్ ఇలా అన్ని రంగాలు హైదరాబాద్‌లో డౌన్‌లో ఉన్నాయని తెలిపింది. దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉన్నట్లు తెలిపింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్థిక రాజధాని ముంబైలో రిక్రూట్‌మెంట్ పరిస్థితి అంత అశావహంగా లేదని మాఫాయ్ తన ఎంప్లాయ్‌మెంట్ సర్వేలో తెలిపింది.