హైదరాబాద్‌లోనూ హార్లే-డేవిడ్‌సన్
న్యూఢిల్లీ: విలాసవంతమైన ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ భారత్‌లో హైదరాబాద్ సహా అయిదు నగరాల్లో డీలర్లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. ఇక్కడి విపణిలో విస్తరించి వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు బెంగళూరు, ఛండీగఢ్, ముంబయి, న్యూఢిల్లీల్లో డీలర్లను నియమించుకున్నట్లుగా సంస్థ వివరించింది. హార్లే-డేవిడ్‌సన్ వాహనాల రిటైల్ విక్రయాలతో పాటుగా విడిభాగాల పంపిణీ, పరికారాల సరఫరా, సర్వీస్ సెంటర్లను కూడా ఈ డీలర్లే నిర్వహించనున్నట్లుగా సంస్థ ఇండియా విభాగం ఎండీ అనూప్ ప్రకాశ్ తెలిపారు. గత ఆగస్టులో భారత్‌లో కార్యకలాపాలుప్రారంభించిన హార్లే-డేవిడ్‌సన్ 12వాహన మోడళ్లకు సంబంధించిన బుకింగ్‌లను ఈనెల 12 నుంచి ప్రారంభించనుంది.