సగం స్కూటర్.. సగం కారు..
చిత్రంలో కనిపిస్తున్న చిన్న కాన్సెప్ట్ కారు పేరు లాండ్ గ్త్లెడర్. దీనిని నిస్సాన్ రూపొందించింది. పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈకారును స్కూటర్ మాదిరిగా ఇద్దరు వెళ్లేందుకు సౌకర్యవంతంగా తయారు చేశారు. దీని పొడవు 3.1 మీటర్లు, వెడల్పు 1.1 మీటర్లు. గరిష్ఠంగా గంటకు సుమారు 62మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో మామూలు కారు మాదిరి స్టీరింగ్ కాకుండా యోక్ స్టీరింగ్ ఉంటుంది. మలుపుల వద్ద అదుపు తప్పకుండా ఇందులో ప్రత్యేక కంప్యూటర్‌ను అమర్చారు. ఇది మలుపులకు తగ్గట్లు వాహన వేగాన్ని నియంత్రిస్తుంది. ప్రత్యేక సెన్సార్‌లు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించి ప్రమాదాలను నివారిస్తుంది.