హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగంలోని నవరత్న హోదా కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) అనుబంధ స్వయం ప్రతిపత్తి కలిగిన పరిశోధనా, అభివృద్ధి విభాగం 2009-10 ఆర్ధిక సంవత్సరంలో మెరు గైన పనితీరు ప్రదర్శించింది. 2008-09 సంవత్సరంలో సాధించిన టర్నోవర్‌పై 2.3 శాతం ముగిసిన ఆర్ధిక సంవ త్సరంలో పరిశోధనా, అభివృద్ధికి ఖర్చు పెట్టారు. మొత్తం 788 కోట్ల రూ.లు పరిశోధనకై వెచ్చించారు. హైదరాబాద్ ఆర్ అండ్ డి కార్పొరేట్ కేంద్ర కార్యాలయం ముగిసిన ఆర్థి క సంవత్సరంలో రూ.6334 కోట్ల టర్నోవర్ సాధిం చింది. గురువారం మీడియా సమా వేశంలో గత ఏడాది పనితీరును సంస్థ జనరల్ మేనేజర్ - ఇన్‌ఛార్జ్ డాక్టర్ హెచ్.ఎస్.జైన్ వివరించారు.
పరిశోధనపై చేస్తున్న వ్యయంలో దేశంలోని నాలుగు అత్యున్నత కార్పొరేట్ సంస్థల్లో ఒకటిగా భెల్ అంతర్జాతీయ గుర్తింపు పొందిం దని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగాలకు సంబం ధించి నూతనత్వంతో కూడిన పరిశోధనలు తమ విభాగం జరుపుతోందని జైన్ తెలిపారు. భారత ప్రభుత్వంతో తాము చేసుకున్న వివిధ అవగాహనా ఒప్పందాలు జాతి పురోభివృద్ధికి దోహదం చేస్తున్నాయని, కఫేర్‌కేడా, బూ స్వాల్ థర్మల్ ప్లాంట్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ సిమ్యులే టర్లను తాము అభివృద్ధి పరిచామని, ఆపరేటర్ల శిక్షణకు ఇవి బాగా ఉపయో గపడతాయని చెప్పారు.
దాంతో పాటు ఆయా స్టేషన్లకు సాఫ్ట్‌వేర్, హ్యూమన్ మిషన్ ఇంటర్‌ఫేస్, వర్చువల్ డేటా కన్ఫిగరేషన్ తదితర పరిజ్ఞానాలను తాము సంస్థాగతంగా రూపొందించి అమలు పరిచినట్లు పేర్కొ న్నారు. సెవా, పర్బాతీ జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం బెంగ ళూరు ఎలక్ట్రానిక్స్ విభాగంతో కలసి ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించామని, 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్లాంట్ల కోసం త్వరగా ఆరిపోయే కండె న్సర్లను విజయవంతంగా రామచంద్రాపురం యూనిట్ తయారు చేసిందని చెప్పారు. దేశంలోని విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అన్ని ప్లాంట్ల అవసరాలను తాము తీర్చగలు గుతున్నామని, ఇందులో అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన పరిశోధనలు దాగి ఉన్నాయని, సమ్మిళిత ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రైజెస్ సేవలలో తమ విభాగం ప్రముఖ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దాదాపు రూ.తొమ్మిది కోట్ల వ్యయంతో నానో టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రా న్ని ఏర్పాటు చేశామన్నారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి ఇది పనిచేయడం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందులో మిషన్ డైనమిక్స్, కంప్రెషర్లు, పంపులకు సంబంధించి నూతన ఆవిష్కరణలకై కృషి చేస్తామని చెప్పారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన సూపర్ కండక్టర్ ఆధారిత పేలడానికి అవకాశం లేని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఈ ఏడాది మంచి ప్రగతి సాధించామని తెలిపారు. సూపర్ కండక్టింగ్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, హై వోల్టేజ్ ఏసి అప్లికేషన్లు, అధిక బలంతో కూడిన పోర్స్‌లెయిన్ ఇన్సులేటర్లు, గ్యాస్ ఇన్సులేషన్‌తో కూడిన ట్రాన్సఫార్మర్లు, ఇన్వర్టర్ డ్రైవ్‌లు, బే కంట్రోల్ యూనిట్లు, శాశ్వత మేగ్నట్ మిషన్లు, గ్యాస్, ఆవిరితో పనిచేసే విద్యుత్ ఉపకరణాలు తయారీలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నామని వివరించారు. మిషన్ డైనమిక్స్, కంప్రెషర్లు, పంపులు, టర్బయిన్ బ్లేడ్స్ తదితర విభాగంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌లెన్సీ కేంద్రాలు విజయవంతంగా ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. తాము అభివృద్ధి పరిచిన అనేక యంత్రాలు, ఉపకరణాలకు భారీ ఆర్డర్‌లు వస్తున్నాయని పేర్కొన్నారు. గత ఆర్ధిక సంవత్స రంలో 263 అంశాలకు సంబంధించి మేథో హక్కులను నమోదు చేశామని, ఇందులో 133 పేటెంట్ హక్కులు, 130 కాపీరైట్లు ఉన్నాయని తెలిపారు.
ప్రత్యేక విద్యుత్ యంత్రాలు, ఉపకరణాలపై గత ఫిబ్రవరి 16, 17 తేదీ లలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించామని, ఈ సద స్సులో పలువురు శాస్తవ్రేత్తలు, విద్యార్ధులు, సాంకేతిక నిపుణులు, విద్యా వేత్తలు, ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని చెప్పారు. ఇటీవల కాలంలో తాము పలు అంతర్జాతీయ ప్రమాణాల ధ్రువీకరణలను అందుకున్నా మని, తమ కార్పొరేట్ సాంఘిక బాధ్యతలలో భాగంగా తమ సంస్థ ఉద్యోగులు రూ.8,13,990లను వరద బాధి తుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి అందిం చారని, పలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిం చామని, సంస్థ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని తెలిపారు. సమావేశానికి సంస్థ ప్రజాసంబం ధాల విభాగం అధికారి ఏ. విశ్వనాధన్ స్వాగతం పలి కారు. సంస్థ జనరల్ మేనేజర్లు ఏ.వి.ఆర్ విఠల్, వైఎన్ ఆర్‌ఎన్ సత్యకుమార్, హెచ్.కృష్ణన్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.