Saturday, May 8, 2010

ముకేశ్‌ భళా.. అనిల్‌ డీలా

స్టాక్‌ మార్కెట్లో ఆర్‌ఐఎల్‌కు 2.27% లాభం
ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ 23 శాతం పతనం
అంబానీ సోదరుల గ్యాస్‌ వివాదంపై శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ముకేశ్‌ కంపెనీల షేర్లు ఓ వెలుగు వెలగగా.. అనిల్‌ షేర్లకు చీకట్లు ముసురుకున్నాయి.
రు రోజులుగా కుంగుతూ వస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక్క సారిగా కోలుకుంది. ప్రారంభంలో రూ.1000 కంటే దిగువగా ఉన్నా ఒక దశలో బీఎస్‌ఈలో 4.85% లాభంతో రూ.1060 దాకా దూసుకెళ్లింది. చివరకు రూ.22.95 లాభంతో రూ.1033.85 వద్ద స్థిరపడింది. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ కలిపి మొత్తం 2.04 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయంటే ట్రేడింగ్‌ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది.

మరోపక్క అనిల్‌కు చెందిన రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌(ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌)కు గట్టి దెబ్బే తగిలింది. ఆ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో ఏకంగా 22.82 శాతం పతనమయ్యాయి. గురువారం రోజు రూ.68.35గా ఉన్న షేరు ధర కాస్తా రూ.15.60 కోల్పోయి రూ.52.75కు దిగజారింది. అంతక్రితం ఒకదశలో 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.50నూ తాకడం గమనార్హం. రెండు ఎక్స్ఛేంజీల్లో కలిపి 37 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి. మరో అడాగ్‌ సంస్థ రిలయన్స్‌ పవర్‌ సైతం దాదాపు 9 శాతం కోల్పోయి రూ.140.10కు దిగజారింది. అనిల్‌కే చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సైతం ఇదే బాటలో పయనించి 7 శాతం మేర నష్టాల పాలయైంది. వివిధ ఇతర అడాగ్‌ సంస్థలకూ నష్టాలు తప్పలేదు.(పట్టిక చూడండి)



విశ్లేషకులేమంటున్నారంటే..
''ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు తక్కువ ధర వద్ద ఆర్‌ఐఎల్‌ గ్యాస్‌ సరఫరా చేయాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పుతో స్పష్టత లభించింది. అనిశ్చితి తొలగింది. కాబట్టి అంబానీల కంపెనీల షేర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌, ఆర్‌పవర్‌లపై తీవ్ర ప్రభావం ఉండొచ్చు''
-హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌
(ప్రైవేట్‌ బ్రోకింగ్‌) వినోద్‌ శర్మ
''ఆర్‌ఐఎల్‌దే విజయమని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆ షేర్లను కొనమని మేం సిఫారసు చేస్తున్నాం. అడాగ్‌ కంపెనీల షేర్లకు ఒత్తిడి ఎదురుకావచ్చు''
-ఏంజెల్‌ బ్రోకింగ్‌ (చమురు-సహజవాయువు)
విశ్లేషకులు దీపక్‌ పరీక్‌
ప్రభుత్వ వైఖరికి మద్దతు లభించింది
గ్యాస్‌ ప్రభుత్వానికి, ప్రజలకు చెందుతుందన్న వాస్తవాన్ని, ప్రభుత్వ వైఖరిని సమర్థించేదిగా ఉన్న సుప్రీం కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏ విధమైన ప్రచారాన్ని నడిపినప్పటికీ.. దేశం తరువాతే ఏదైనా.
- మురళీ దేవ్‌రా, కేంద్ర పెట్రోలియమ్‌ శాఖ మంత్రి
ఆమోదముద్ర పడింది
దేశానికి ప్రకృతి ప్రసాదించిన సహజ వాయు వనరులపై సార్వభౌమ, రాజ్యాంగ బద్ధ హక్కులు ప్రభుత్వానివేనన్న అంశాన్ని తీర్పు ప్రమాణీకరించింది. తీర్పు ఏ వైపు అనుకూలంగా ఉందన్న దానిపై నేనేమీ వ్యాఖ్యానించను. కానీ, ప్రభుత్వం అనుసరించిన వైఖరి మరీ ముఖ్యంగా పెట్రోలియమ్‌, సహజ వాయు మంత్రిత్వ శాఖ అవలంబించిన వైఖరిని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది.
- వీరప్ప మొయిలీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి
ఎన్‌టీపీసీ కేసుపై ప్రభావం ఉండదు
సుప్రీం తీర్పు న్యాయబద్ధమైందే. గ్యాస్‌ కోసం ఆర్‌ఐఎల్‌తో మేం (ఎన్‌టీపీసీ) చేస్తున్న పోరాటంపై ఈ తీర్పు ప్రభావం ఏమీ ఉండదు. తీర్పులో ఎక్కడా ఎన్‌టీపీసీ ప్రస్తావన రాలేదు. ఆర్‌ఐఎల్‌ గ్యాస్‌కు ఒక్కో ఎంబీటీయూకు 4.20 డాలర్ల ధరను ఆమోదించి, ప్రాధాన్య క్రమం ఎంపిక, బొంబాయి హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ అపీలు చేయాలని నిర్ణయం తీసుకోవడం వంటి విషయాల్లో నా ప్రమేయం ఉంది.
- సుశీల్‌ కుమార్‌ షిండే, కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి
తీర్పు బాగుంది
ర్‌ఎన్‌ఆర్‌ఎల్‌- ఆర్‌ఐఎల్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు బాగుంది.
- ప్రణబ్‌ ముఖర్జీ,ఆర్థిక మంత్రి
హజవాయువు జాతి సంపద అని, గ్యాస్‌ చట్టబద్ధ యజమాని ప్రభుత్వమేనని చెప్తూ వస్తున్న ప్రభుత్వ వైఖరినే సుప్రీం కోర్టు తీర్పు పునరుద్ఘాటించింది. దేశంలోని గ్యాస్‌ ధరలకు ఈ తీర్పు మరింత నిలకడతనాన్ని సంతరిస్తుంది. మదుపర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. ఎరువుల రంగం సైతం లాభపడనుంది.
- శ్రీకాంత్‌ జేనా, కేంద్ర ఎరువుల శాఖ సహాయ మంత్రి