రెట్టింపు ముడిచమురు ఇస్తాం :భారత్‌కు సౌదీ అరేబియా హామీ
రెట్టింపు ముడిచమురు ఇస్తాం
భారత్‌కు సౌదీ అరేబియా హామీ
 రియాద్: భారత దేశ 'ప్రస్తుత, భావి' చమురు అవసరాలను కొంతవరకైనా తీర్చడానికి సుముఖంగా ఉన్నట్లు సౌదీ అరేబియా హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఏడాదికి భారత్‌కు సరఫరా చేస్తున్న ముడి చమురు పరిమాణాన్ని రెట్టింపునకు పెంచి సుమారు 40 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) వంతున అందజేయగలమని సౌదీ పేర్కొంది. భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా సౌదీ పెట్రోలియమ్, ఖనిజ వనరుల శాఖ మంత్రి అలీ అల్-నైమీతో భేటీ అయిన సందర్భంగా వారు ఇరువురు ప్రపంచ చమురు మార్కెట్ల తీరుతెన్నులపై చర్చలు జరిపారు. స్థిరత్వం తీసుకురావడానికి సౌదీ చేస్తున్న కృషిని అల్-నైమీ ఈ సందర్భంగా సింగ్‌కు వివరించారు.