రండి... రండి... మా దేశం
రియాద్: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా సౌదీ అరేబియా పారిశ్రామికవేత్తలకు భారత ప్రధాని మన్మోహన్ పిలుపునిచ్చారు. మౌలికవసతుల కల్పన మొదలుకొని ఆతిథ్య రంగం వరకూ ఎన్నో రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రానున్న పాతికేళ్ళలో భారతదేశ జీడీపీ ఏటా 9-10 దాకా వృద్ధి చెందగలదన్న విశ్వాసాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం రూపుదిద్దుకోనుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. భారత్, సౌదీల మధ్య సహకారానికి ఎంతో అవకాశం ఉందన్నారు.
సౌదీ కాన్సులేటివ్ కౌన్సిల్ జరిగిన సదస్సులో భారత ప్రధాని మన్మోహన్ ప్రసంగించా రు. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.5 శాతం వృద్ధిరేటును సాధించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ళుగా భారత ఆర్థిక వ్యవస్థ ఏటా 9 శాతం సగటు రేటుతో వృద్ధి చెందిందని అన్నారు. సౌదీలో ఐటీ, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్, ఫార్మాస్యూటికల్స్, హైడ్రో కార్బన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత పారిశ్రామికవేత్తలు ఆసక్తితో ఉన్నారన్నారు.
2008-09లో రెండు దేశాల మధ్య 25 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపారం జరిగింది. సౌదీ అరేబియాలో భారతీయ పెట్టుబడులు 500కు పైగా జాయింట్ వెంచర్లలో 2 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. భారతీయ ప్రముఖ కంపెనీలెన్నో ఇప్పటికే సౌదీ అరేబియాలో తమ ఉనికిని కలిగిఉన్నాయని ప్రధాని మన్మోహన్ ఈ సందర్భంగా అన్నారు. సౌదీ అరేబియా భారత్‌కు అతి ముఖ్యమైన వ్యాపార భాగస్వామి అని ప్రధాని అన్నారు. 2008-09లో రెండు దేశాల మధ్య 25 బిలియన్ డాల ర్ల మేరకు వాణిజ్యం జరగడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య సంప్రదాయకంగా కొనసాగుతూ వస్తు న్న వ్యాపార బంధాన్ని మరింత విస్తరించే మార్గాలను తాము అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందురోజు ఆయన సౌదీ వాణిజ్య సంఘాల సదస్సులోనూ ఇదే విషయాలను స్పష్టం చేశారు. గత 28 ఏళ్ళలో సౌదీ అరేబియాను సందర్శించిన తొలి భారత ప్రధాని మన్మోహన్ కావడం విశేషం.
భారత్‌కు ఇంధన చేయూత..
భారత్‌కు ఇంధన, ముడిచమురు సహకారాన్ని అందించేందుకు సౌదీ అరేబియా సిద్ధమైంది. దేశానికి ఉన్న ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన సహాయాన్ని సౌదీ దేశం అందించనుంది. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలసి నిర్వ హించిన సమావేశంలో సౌదీ పెట్రోలియంశాఖ మంత్రి అలీ-అల్-నేమి ఈ విష యాలను వెల్లడించారు. ప్రపంచ ముడిచమురు వ్యాపారానికి స్థిరత్వాన్ని తెచ్చే విధం గా కృషి చేయాలని ఆయన భారత్‌ను కోరారు. భాగస్వామ్య పెట్టుబడుల విషయాలను కూడా ఈ సమావేశంలో వారు చర్చించారు. త్వరలో భారత్‌కు ఏటా రెండింతలు అధికంగా ముడి చమురును 40మిలియన్ మెట్రిక్ టన్నుల మేరకు సౌదీ ఆరేబియా అందించనుందని సౌదీ మంత్రి తెలిపారు. తద్వారా భారత రిఫైనరీలకు అవసరమయ్యే ముడిచమురును అందిచ గలుగుతుంది. అనంతరం జరిగిన సౌదీ ఛాంబర్ ఆప్ కామర్స్ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంప్రదాయంగా వస్తున్న విక్రయదారు-కొనుగోలుదారు సంబంధాన్ని విస్తృతపరిచి పూర్తిస్థాయి ఇంధన భాగస్వామిగా తాము సౌదీ దేశాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు.
12న ఖతార్ ఎన్‌ఆర్‌ఐల సమావేశం...
ఖతార్ చాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 12వ తేదీ నుండి 14వ తేది వరకు ఎన్‌ఆర్‌ఐ సమావేశాన్ని నిర్వహించనుంది. పెట్టుబడిదారులకు అవకాశాన్ని ల్పించే విధంగా ఈ సమ్మిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. బారత్-ఖతార్‌ల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు ఏర్పాటు కానున్న ఈ సమా వేశంలో దేశ అతిథులతో పాటు పలువురు ప్రవాసాంధ్రులు కూడా పాల్గొననున్నారని గల్ఫ్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఈ సమావేశాన్ని ఖతార్ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్ ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్(ఐబీపీఎన్) సౌజన్యంతో నిర్వహించ నుంది.
భారత రాయబారి దీపా గోపాలన్ వాధ్వా ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటు ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఖతార్ ఛాప్టర్‌ను కూడా ప్రారంభిస్తారు. ఈ సమా వేశంలో భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఖతార్ పారిశ్రామికవేత్త ్తలు, అధికారులు ఇంటరాక్టివ్ సెమినార్‌లో పాల్గొంటారు. భారత సంతతికి చెందిన వారితో పాటు ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ సంస్థ ఓ వేదిక కానుంది. ఇందులో దేశ ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులను ప్రోత్సహించడం, ఎంచు కున్న రంగాల్లో ప్రగతిని సాధించిన ఎన్‌ఆర్‌ఐలను గుర్తించడం వంటి కార్యక్రమాలను చేపడతారు. భారత ప్రధాని మన్మోహన్ పర్యటన రెండు దేశాల మధ్య ఆర్థిక అను బంధాన్ని పెంచేందుకు దోహదపడే రీతిలో కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి రెట్టింపు స్థాయిలో ముడిచమురును పొందగలగడం దేశ ఇంధన భద్రతకు దోహదం చేయనుంది.