Thursday, May 6, 2010

చమురు సంస్ధలకు ప్రభుత్వ పరిహారం రూ.14 వేల కోట్లు

indianoilన్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తక్కువ ధరలకు పెట్రో ఉత్పత్తులను 2009-10 ఆర్థిక సంవత్సరంలో విక్రయించినందుకు నష్టపరిహారంగా రూ.14,000 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రభుత్వ పరిహారాన్ని అందుకోనున్నాయి. 2009-10 ఆర్థిక సంవ త్సరంలో ఈ మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వంటగ్యాస్‌, కిరోసిన్‌ను తక్కువ ధరలకు విక్రయిం చినందుకు రూ.31,621 కోట్లు నష్టపోయాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఇందుకు పరిహారంగా గతంలో రూ.12,000 కోట్లను విడుదల చేసింది.

దానికి అదనంగా తాజాగా మరో రూ.14,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. తామ అదనపు పరిహారంగా రూ.19,620 కోట్లను ఆశిం చామని, అయితే ఆర్థిక శాఖ రూ.14,000 కోట్లు మాత్రమే ఇచ్చిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా పేర్కొన్నారు. ఈమేరకు తమ శాఖ కార్య దర్శి ఎస్‌.సుదర్శన్‌, వ్యయశాఖ కార్యదర్శి సుష్మానాధ్‌తో బుధవారం చర్చలు జరిపారని చెప్పారు. మూడు ప్రభుత్వ రంగ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, కిరోసిన్‌ విక్రయాలపై మొత్తం రూ.46,051 కోట్లు నష్టపోయాయి. దిగుమతి ధర కన్నా తక్కువ స్థాయిలో విక్రయాలు జరిపినందుకు ఈ నష్టం సంభవిం చింది.

bharatpetroliumఅయితే ఈ నష్టాన్ని ఓఎన్‌జిసి, ఆయిల్‌ ఇండియా సంస్థలు రూ.14,430 కోట్లకు భరించాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలకు ఏర్పడుతున్న నష్టం లో పై రెండు సంస్థలు 32 శాతం వరకు భర్తీ చేయగలు గుతున్నాయి. అంతకుమించి వాటి సామర్ధ్యం సరిపోవడం లేదు. తమ సంస్థలకు ఏర్పడుతున్న పూర్తి నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయవలసిందేనని చమురు మంత్రిత్వ శాఖ పట్టుబడుతోంది. తమ మంత్రిత్వ శాఖ కూడా రూ.14,000 కోట్ల మేరకు మూడు మార్కెటింగ్‌ సంస్థలను ఆదుకుంటోందని, మిగిలిన రూ.5,621 కోట్ల మాటేమిటని మురళీ దియోరా ప్రశ్నిస్తున్నారు.

తక్కువ ధరకు పెట్రోలియం ఉత్పత్తులు అమ్ముతున్నందున మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు రూ.272.5 కోట్లు నష్టపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ భారం రూ.90,150 కోట్లకు చేరుతుందని అంచనా. చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.6.63, డీజిల్‌పై రూ.6.25, ప్రజా పంపిణీ వ్యవస్థకు సరఫరా చేస్తున్న కిరోసిన్‌పై లీటర్‌కు రూ.19.74, 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.254.37 కోట్లు నష్టపోతు న్నాయి.

hpcl-logoనానాటికి సంక్షోభంలో చిక్కుకుంటున్న చమురు సంస్థలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల సాధికార కమిటీ వచ్చే వారం సమావేశమై పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేతపై ఒక నిర్ణయం తీసు కోవచ్చు. అలాగే చమురు సంస్థల నష్టాల భర్తీపై కూడా ఒక విధాన ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. వ్యవ సాయ మంత్రి శరద్‌పవార్‌, రైల్వే మంత్రి మమతా బెనర్జీ, ఎరువుల శాఖా మంత్రి ఎం.కె.అళగిరి, రోడ్డు రవాణా మంత్రి కమల్‌నాథ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా సాధికారిక కమిటీలో సభ్యులుగా ఉన్నారు.