గ్రీస్‌కు మూడేళ్లలో రూ.7.20 లక్షల కోట్లు!
ఏథెన్స్: రుణ సంక్షోభంలో చిక్కి విలవిల్లాడుతున్న గ్రీస్‌ను దివాలా స్థితి నుంచి గట్టెక్కించడానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ), అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లు ఎట్టకేలకు ఒక సహాయ పథకాన్ని ప్రకటించేందుకు మార్గం సుగమం అయింది. జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీలు శనివారం గ్రీస్‌ను ఆదుకొనే పథకాన్ని సత్వరమే అమలు చేయాలని ఒక కృత నిశ్చయానికి వచ్చారు. మూడేళ్లలో 120 బిలియన్ యూరోలు (సుమారు రూ.7.20 లక్షల కోట్లు) గ్రీస్‌కు సహాయంగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సర్కోజీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.