అనకాపల్లి: అనకాపల్లి బెల్లం ఎగుమతి వర్తకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా యి. ఈసారి లాభాలు రావు సరికదా, భారీగా నష్టాలు వస్తాయని ఆందోళన చెందుతు న్నారు. బెల్లం ధరలు ఒకేసారి అనూహ్యంగా తగ్గటమే ఈ ఆందోళనకు కారణం. ఈ ఏడాది బెల్లం సీజన్ ప్రారంభంలో 10 కిలోలు గరిష్ఠంగా రూ.317 ధర పలికింది. అప్పట్లో వర్తకులు రూ.300, అంతకు పైన ధరల్లోనే బెల్లాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తు తం బెల్లం ధరలు 10 కిలోలు రూ.245- రూ. 212 మధ్య ఉంది. బెల్లం ధరలు ఈ ఏడాది ఆగస్టు లోగా రూ.350 నుంచి రూ.400కు రాకుంటే నిల్వ వేసిన వర్తకులు భారీగా నష్టపోవలసి ఉంటుందని ఒక వర్తకుడు చెప్పారు.
అనకాపల్లి మార్కెట్‌లో ఇంత వరకూ సుమారు 25 వేల టన్నులు అంటే 2,500 లారీల సరుకును ఎగుమతి వర్తకులు రూ. 300 పైబడి ధరలో కొనుగోలు చేసి నిల్వ చేశారు. అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న కోల్డు స్టోరేజీలు (శీతల గిడ్డంగులు)లో మాత్రమే కాకుండా రాజ మండ్రి వంటి సుదూర ప్రాంతంలోని గిడ్డంగుల్లో సైతం బెల్లం నిల్వలు చేశారు. మామూలు గోడౌన్లు బెల్లం నిల్వలకు పనికిరావు. అందుకే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. గత ఏడాది బెల్లం నిల్వ చేసి అమ్మకాలు చేసిన ఎగుమతి వర్తకులకు ఒక్కొక్క లారీ పై(సుమారు 10 టన్నులు) రూ.50 నుంచి రూ.60 వేలు లాభం వచ్చింది. ఈ ఏడాది కూడా లాభాలు బాగా సాధించవచ్చని ఆశించి నిల్వ లను అధికంగా వేశారు.
గత ఏడాది లాభాల రుచి చూసిన వ్యాపారులు మాత్రమే కాకుండా గతంలో ఎప్పుడూ బెల్లం ఎగుమతి జోలికి వెళ్లని వర్తకులు సైతం ఈ సారి నిల్వలు వేశారు. గత ఏడాది 1, 650 లారీల బెల్లాన్ని కోల్డు స్టోరేజీ ల్లో నిల్వ చేయగా ఈ ఏడాది మరో 850 లారీల బెల్లంను నిల్వ చేశారు. ఇంత భారీ స్థాయిలో బెల్లం నిల్వలు చేయటం గతంలో ఎప్పుడూ జరగలేదని ఒక వర్తకుడు చెప్పారు. బెల్లం ధరలు తగ్గటమే కాకుం డా కోల్టు స్టోరేజీ అద్దెలు కూడా బాగా పెరిగాయని చె ప్పారు.
గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అద్దెను చెల్లించవలసి వస్తుందని, ఇది కూడా వర్తకు లకు నష్టం తెచ్చే అంశం అని ఆయన చెప్పారు. అనకాపల్లి మార్కెట్‌కు ఏప్రిల్‌తో సీజన్ ముగిసింది. అయినప్పటికీ బెల్లం అమ్మకానికి వస్తూనే ఉంది. రోజుకు సగటున 12 వేల బెల్లం దిమ్మలు అమ్మ కానికి వస్తున్నాయి. జిల్లాలో 4 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అనుకోని విధంగా ఈ ఏడాది వాటి క్రషింగ్ సీజన్ ముందుగానే ముగిసింది. దీంతో రైతులు తమ వద్ద ఉన్న చెరకును బెల్లంగా తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్లం ధరలపై పలువురు వర్తకులు ఆందోళన చెందుతున్నారు.