సామర్లకోట: రాష్ట్రంలో రెండే రెండు మండలాల్లో ఉన్న 32 సాగో ఫ్యాక్టరీల పట్ల రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నది. ఖాయిలా పడిన పరిశ్రమ లకు, ప్రభుత్వానికి వారధిలా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో రూ. కోట్లు విలువ చేసే సాగో పరి శ్రమ భూస్థాపితం అయ్యే పరిస్థితి ఏర్పడింది.
భారత దేశం మొత్తానికి తమిళనాడులోని సేలం, ఆంధ్రప్రదేశ్ ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో సగ్గుబియ్యం పరిశ్రమలు 22 ఉన్నాయి. వీటి లో సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని 13 సగ్గు బియ్యం ఫ్యాక్టరీలు ఉన్నాయి. సగ్గుబియ్యం తయా రీకి అవసరమయ్యే కర్రపెండలం దుంప తూర్పు గోదావరి జిల్లాలో 13 మండలాల్లో (మెట్టప్రాంతం) లక్ష ఎకరాల్లో రైతులు సాగుచేసేవారు. దీనితో నాటిన దగ్గర నుంచి దుంప తీసేవరకు ఆరు నెలలపాటు వేలాది రైతు కూలీలకు ఉపాధి లభించేది. వర్షాధారంతో పండే కర్రపెండలం 18 నుంచి 25 పుట్లు దిగుబడి వచ్చేది.
ఒక పుట్టు (225 కేజీల బస్తాలు) రూ. 600 నుంచి 800లు రైతులు సాగో మిల్లులకు అమ్మేవారు. దీని ద్వారా ఎకరానికి 15 వేలు వరకు రైతులు లాభ పడేవారు. ఎకరానికి ఆరు నుంచి పది వేలు ఖర్చు అయ్యేది. దుంప నుంచి పాలుతీసి ఆ పాల ద్వారా సగ్గుబియ్యం తయారుచేసి 90 కేజీల సగ్గుబియ్యం బస్తా రూ. రెండు వేల నుంచి మూడు వేల వరకు విక్రయించేవారు. ఈ విధంగా ఏటా రెండు నుంచినాలుగు లక్షల వరకు సగ్గు బియ్యం బస్తాలు ఎగుమతి చేసే వారు. దీనితో వేలాది కార్మికులకు జీవనోపాధి లభించడమే కాక ప్రభుత్వా నికి వివిధ టాక్స్‌ల రూపేణా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అన్ని రకాలుగా ప్రభుత్వానికి ఒక్కో మిల్లు నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేది.మలేషియా, నైజీరియాలలో తక్కువగా పండే కర్రపెండలం దుంప పంట తూర్పుగోదావరి జిల్లాలో, తమిళనాడు రాష్ట్రం సేలం లోను ఎక్కువగా పండుతుంది. ఈ దుంప ద్వారా తయా రుచేసిన సగ్గుబియ్యం ఇతర దేశాలతోపాటు దేశంలోని వరి పండని రాష్ట్రాలకు విరివిగా ఎగుమతి అవుతుంది. సగ్గుబియ్యాన్ని పశ్చిమబెంగాల్, మహారాష్టల్ల్రో కిచిడి చేసుకుని తింటారు. ఒరిస్సా, అస్సాంలో ఒక గ్లాసు సగ్గు బియ్యంలో మూడు గ్లాసుల నీళ్ళు, ఉప్పు, కారం కలుపు కుని మధ్యాహ్నం భోజనంగా తింటారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో పాయసం, క్షీరాన్నం, వడియాలు, అప్ప డాలు, చిప్స్ తయారీకి ఉపయోగిస్తున్నారు.
మజ్జిగ పులు సు, సాంబారులలో సగ్గుబియ్యం వేయించి వాడుతారు. నెయ్యిలో పేలాలుగా వేయించి కారంపొడి జల్లి తింటారు. అంతేకాకుండా జిల్లాలోని 32 శాగో ఫ్యాక్టరీల తోపాటు ఎండుదుంప ఆడే ఫ్లోర్ మిల్లులు 30 ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్‌మిల్లు వెయ్యి ఎకరాల్లో వచ్చే ఎండుముక్క కొను గోలు చేసి పిండి తయారుచేస్తారు. ఈ పిండిని మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
ఈ స్టార్చ్ పిండి సేమియాకు, స్టార్ హోటళ్ళలో సూప్ కింద వాడతారు. మనం తాగే గ్లూకోజ్ తయారీలో వాడతారు. నెంబర్‌వన్ 100 కేజీ స్టార్చ్ పిండి నుండి మైక్రో మిషన్ ద్వారా 10 శాతం మెడిసిన్ తయారీలో వాడ తారు. కొన్ని రకాల వంటకాలు, కూరల్లో వాడే ఈ స్టార్చ్ పౌడర్‌ను సూర్య కలర్స్ వారి పెయింట్స్, సున్నాల తయారీలో గమ్ము క్రింద ఉపయోగిస్తారు. కాస్ట్‌లీ బట్టలు, పట్టు చీరలు, గ్లాస్కో పంచెలకు గంజి కింద వాడతారు. వెట్ స్టార్చ్ లిక్విడు గ్లూకోజ్ పానకం క్రింద తయారుచేసి చాక్‌లెట్, బిస్కెట్, రొట్టెలలో వేసే జామ్ క్రింద వాడతారు.సగ్గుబియ్యం తయారుచేసి పాలిష్ చేసిన తరువాత సగ్గుబియ్యం నూక వస్తుంది. ఈ నూక సిరిసిల్ల చేనేత పరిశ్రమల వారు చేనేత వస్త్రాలకు గంజి పెట్టే మెత్తని పిండి క్రింద వాడతారు. కర్రపెండలం ఆడగా వచ్చిన వేస్టు పిప్పి, ఎండుముక్క ఆడగా వచ్చిన పొట్టు పశువుల దానాకు, చేపలు పెంపకానికి వాడతారు. ఎండుముక్కు ఆడగా వచ్చిన ఫ్లవర్ (మెత్తని పిండి) అన్ని రకాల స్వీట్లు, పిండి వంటలలో వాడతారు. మహారాష్టల్రో బిన్ని కంపెనీ వారు కలర్ బట్టలకు వాడతారు. ఇన్ని రకాల ఎగుమతులకు ఉపయోగపడుతున్న కర్రపెండలం సాగు విషయంలోను, పరిశ్రమల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడంతో గత ఏడాది నుంచి సాగు తగ్గడమేకాక శాగో మిల్లులు మూతపడే దశకు చేరుకున్నాయి. 12 పరిశ్రమ లు మూతపడగా దుంపసాగు 30 వేల ఎకరాలకు పడి పోయింది.
దీనితో వేలాది కూలీలు, వర్కర్లు జీవనోపాధి కోల్పోవడమే కాక ప్రభుత్వానికి కోట్లలో ఆదాయ మార్గా లు సన్నగిల్లాయి. దీంతో ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో పంట దిగుబడికి లక్ష సగ్గుబియ్యం బస్తాలే ఎగుమతి అయ్యాయి. రైతులు, కూలీలు, మిల్లర్లు నష్టాలు ఎదుర్కొం టున్నారు. ఓ ప్రక్క ప్రాజెక్టు ఆప్టెక్ వల్ల మిల్లులు దెబ్బ తినగా, ప్రభుత్వం ఆదుకోక రైతులు నష్టపోతున్నారు. దీం తో వేలాది కూలీలు, వర్కర్లు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం సాగో రైతులకు పావలా వడ్డీ కింద ఒక ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందిస్తే దుంపసాగు పెరుగుతుంది.
అన్ని రకాల రాయితీలు ప్రభుత్వం ఇస్తే వచ్చే మూడేళ్ళలో లక్ష ఎకరాల్లో దుంప తోటలు అభివృద్ధి చెందుతాయి. అదే విధంగా మిల్లర్లకు ప్రభుత్వం కరెంటు సబ్సిడి ఇవ్వాలి. బ్యాంకులు ఇచ్చిన రుణాలకు సబ్సిడి ఇస్తే పరిశ్రమలు నిల బడతాయి. వేలాది కార్మికులకు, కూలీలకు ఉపాధి అందిం చే మిల్లుల పట్ల ప్రభుత్వం ఏనాడూ సహకారం అందిం చడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు కర్రపెండలం విత్తనం, మిల్లర్లకు ఆర్ధికంగా సహాయం అందిస్తే ఎందరో కార్మికులకు, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. తద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుంది.