గత వారం జరిగిన టెలికాం విభాగం సమావేశానికి టెలికాం కార్యదర్శి ి పీజే థామస్‌తో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండి కుల్‌దీప్ గోయల్ హాజరయ్యారు. సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నియామాలను మరింత నాణ్యతాపరంగా చేపట్టా లని, మార్కెట్‌లోని ప్రసుత పోటీను ఎదుర్కోడానికి ఈ నిర్ణయాలు అవసరమ ని పిట్రోడా కమిటీ తెలిపింది. ప్రసుతం దేశీయ టెలికాం మార్కెట్లో ప్రయి వేటు సంస్థ భారతీ సంస్థ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. సంస్థ ఉన్నత పదవుల నియామకాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గత ఆర్థిక సంవత్సరం మొదటి 9 మాసాల్లో సంస్థ లాభాలు రూ.175 కోట్లకు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా బీఎస్‌ఎన్‌ఎల్ నికర నష్టాలనే నమోదు చేయవచ్చని భావిస్తున్నారు.
రెండో వేతన సవరణ తరువాత సంస్థలోని బోర్డు సభ్యులు 200శాతం బేసిక్ బోనస్‌తో పాటు ఇతర్ లాభాలను కూడా పొంద వచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ సమావేశంలో ప్రకటించింది. ప్రస్తుతం ప్రైవేటు రంగ సంస్థల ఉన్నతాధికారుల వేతనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మార్కెట్‌లో నెలకొన్న పోటీని దృష్టిలో పెట్టుకుని కొత్త ఉన్నతాధికారుల నియామకాల ప్రక్రి య మొదలైతే సంస్థ కొత్త నిర్ణయాలకు బోర్డు కట్టుబడి ఉంటుందని, బీఎస్ ఎన్‌ఎల్ సీఎండీ గోయల్ పేర్కొన్నారు. త్వరలో డాట్ బీఎస్ ఎన్‌ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ పదవులను రెండుగా విభజించనుందని సంస్థ తెలి పింది. పిట్రోడా కమిటీ సూచించిన ఈ అంశాలకు బోర్డు త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.