
పీఎస్‌యూల్లో 31,000ఉద్యోగాలు
స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్), వలసల కారణంగా 2008-09లో 246 ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగుల సంఖ్య 15.66 లక్షల నుంచి 15.35 లక్షలకుతగ్గిందని పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ కార్యదర్శి భాస్కర్ చటర్జీ తెలిపారు. దీనిని పూర్వ స్థితికి తీసుకువెళ్లేలాతాజా నియామకాలను ఉండవచ్చని ఆయన చెప్పారు. ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నపుడూ పీఎస్‌యూల లాభంలో దాదాపు 8 శాతం వృద్ధి ఉందని, 2009-10లో ప్రభుత్వ రంగం ఎవ్వరికీ ఉద్వాసనలు పలకలేదని వివరించారు.
ప్రతిభావంతుల వేటలో బీఎస్‌ఎన్‌ఎల్
క(న)ష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు ప్రైవేటు రంగంలోనిప్రతిభావంతులను మేనేజ్‌మెంట్‌లోని ఉన్నత స్థానాల్లోకి తీసుకోవాలి టెలికాం శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఛీప్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో నియమించుకొనే వ్యక్తికి ఏడాదికి రూ.10కోట్లు, బోర్డు సభ్యులకు ఏడాదికి రూ.5 కోట్లు చొప్పున చెల్లించే అంశంపై గత వారం టెలికాం శాఖ సమాలోచనలు జరిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ను తిరిగి లాభాల బాట పట్టించడంలో శ్యామ్ పిట్రోడా కమిటీ సూచించిన సిఫార్సుల మేరకే టెలికాం శాఖ ఈ అంశంపై సమాలోచనలు జరుపుతోంది.
ఇంటెలీనెట్‌లో 7000 ..
ముంబయి: గడ్డు కాలం దూరమవుతూ ఐటీ, బీపీఓ పరిశ్రమలు మళ్లీ వృద్ధిపథంలో పయనిస్తుండటంతో బీపీఓ సేవల సంస్థ ఇంటెలీనెట్ గ్లోబల్ సర్వీసెస్ కొత్తగా 7,000 మందిని భర్తీ చేసుకోనుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడంతో ఐటీ పరిశ్రమ ఇక రెండంకెల వృద్ధిని నమోదు చేయగలదని తాము భావిస్తున్నట్లు సంస్థ సీఈఓ సుసిర్ కుమార్ తెలిపారు. ఐటీ, బీపీఓ రంగాలు 15-20 శాతం వృద్ధి చెందవచ్చని ఆయన అన్నారు. విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా దేశీయంగా కొత్తగా 7000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని తాము యోచిస్తున్నట్లు వివరించారు. ఇంటెలీనెట్‌కు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 32,000మంది, దేశీయంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వ్యాపార విస్తరణ కార్యక్రమంలో భాగంగా చైనా, మధ్య ప్రాచ్యం, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో సంస్థ కార్యాలయాలు తెరవాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటెలీనెట్ సంస్థ బీపీఓ సేవలను స్పర్శ్ బీపీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కొత్తగా 2,500 మంది ఏజెంట్ల భర్తీ: మాక్స్ బ్యూపా
ఆరోగ్య బీమా రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన మాక్స్ బ్యూపా సంస్థ ఈ ఏడాది కొత్తగా 200 మందిని ఉద్యోగాల్లోకి తీసుకొనుంది. విస్తరణ కార్యక్రమంలో రానున్న అయిదేళ్లలో సుమారు రూ.550 కోట్లను ఈ సంస్థ ఖర్చు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా మరో 2,500 ఏజెంట్లను కూడా నియమించుకోనున్నట్లు తెలిపింది.