చల్ వాహన రంగా
ఏప్రిల్‌లోనూ గణాంకాలు ఘనమే న్యూఢిల్లీ: వాహన రంగం పరుగు కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనూ ఆగలేదు. కార్లు, ద్విచక్ర వాహనాలతో పాటు వాణిజ్య వాహనాల విక్రయాల్లోనూ వృద్ధి కొనసాగింది. మారుతీ, టాటా మోటార్స్, టీవీఎస్, హీరోహోండా వంటి దిగ్గజాలన్నీ గణనీయమైన గణాంకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్ వాహన విక్రయాలు గత ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో 27,518 నుంచి 52 శాతం పెరిగి 57,202కు చేరాయి. ద్విచక్ర వాహన దిగ్గజం హీరోహోండా విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో 3,71,652 కాగా, గత ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం 3,70,575. ఒక నెలలో 3 లక్షలకు మించి వాహనాలు విక్రయించడం వరుసగా ఇది 16వ సారి. సుజుకీ మోటార్ సైకిల్స్ విక్రయాలు 53.22 వృద్ధితో 13,556 నుంచి 20,771 కు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ 77.23% వృద్ధితో వాహన విక్రయాలను 3,384 నుంచి 6,001కు పెంచుకుంది. వివిధ కంపెనీల విక్రయాలు పట్టికలో.. 

