Wednesday, May 5, 2010

ఆపిల్ ఐ-ప్యాడ్ అమ్మకాలు అదరహో...

చేతిలో ఇమిడిపోయే సైజులో ఆపిల్ సృష్టించిన టాబ్లెట్ పిసి ఐ-ప్యాడ్ అమ్మకాలు స్వల్పకాలంలోనే పది లక్షల మార్కును అధిగమించి సంచలనం సృష్టించాయి. ఏప్రిల్3న మార్కెట్ ప్రవేశం చేసిన ఈ ప్రొడక్టు కేవలం 28 రోజుల్లోనే కీలకమైన ఈ మైలురాయిని అధిగమించింది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపిల్ మరో ప్రొడక్టు ఐ-పాడ్ అమ్మకాలు పది లక్షల మార్కును చేరుకోవడానికి 74 రోజులు పట్టింది. భవిష్యత్తులో ఐ-ప్యాడ్ మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటుందని ఆపిల్ సిఇఒ స్టీవ్ జాబ్స్ అంటున్నారు.

ఒక పెద్ద సెల్‌ఫోన్ సైజులో ఉండే ఈ లిటిల్ కంప్యూటర్‌లో నెట్ బ్రౌజింగ్‌తో పాటు పాటలు వినడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, కంప్యూటర్‌తో నిర్వహించే గలిగే ఇతర చిన్న చిన్న పనులనూ సులభంగా చేసుకోవచ్చు. ఇ-బుక్ రీడర్‌గా ఐ-ప్యాడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ని ఫీచర్లు ఉండటమే ఐ-ప్యాడ్ సంచలనాలకు కారణమని స్టీవ్ అంటున్నారు. ఇప్పటికే ఐ-ప్యాడ్ యూజర్లు ఆపిల్ స్టోర్స్ నుంచి 1.2 కోట్ల అప్లికేషన్లను, ఐ-బుక్‌స్టోర్ నుంచి 1.5 కోట్ల ఇ-బుక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం.