ఐపీఎల్ ముగిసింది. టీ20 వరల్డ్ కప్ మొదలయ్యింది. ఇక క్రికెట్ అభిమానుల సందడే సందడి. వేసవి సెలవులు కావడంతో గల్లీల్లో క్రికెట్ గోల ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసే ఆన్‌లైన్ క్రికెట్ గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి. డౌన్‌లోడ్స్, ఇన్‌స్టలేషన్ లేకుండా సైట్‌లో సభ్యత్వ నమోదు చేసుకుని మైదానంలో ఫోర్‌లు, సిక్స్‌ల వర్షం కురిపించవచ్చు. బౌన్సర్‌లు వేసి ప్రత్యరులను అవుట్ చేయవచ్చు. మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయవచ్చు. మరెందుకాలస్యం? ఇంటి వరండా, వీధి గుమ్మం, గుడి చావిట్లో మండే ఎండల్లో ఆడే క్రికెట్‌కు కాస్త విశ్రాంతి ప్రకటించి చల్లని మజ్జిగ తాగుతూ ఆన్‌లైన్ క్రికెట్‌లో అడుగుపెడదామా?టీ20... వన్‌డే... టెస్ట్‌సిరీస్... ఆడే మ్యాచ్ ఏదైనా.. జట్టుకి మీరే కోచ,్. కెప్టెన్! ప్రత్యర్ధి జట్టు ఎంపికా మీదే! మరి,. ఆట మొదలు పెడదామా?
నిజమైన అనుభూతి
క్రికెట్ ప్రియులకు చక్కని వినోదాన్ని అందించేందుకు రూపొందించిందే SLOGOUT. నిజంగా క్రికెట్ ఆడుతున్న అనుభూతి దీంట్లో పొందొచ్చు. బౌలర్ పరుగెత్తుతూ బౌలింగ్ చేస్తే బ్యాట్స్‌మెన్ ముందుకొచ్చి కొట్టొచ్చు. పిచ్‌పై రన్స్ కూడా తీస్తారు. నిజమైన క్రికెట్‌లో మాదిరిగానే లైవ్ స్కోర్‌బోర్డ్‌ని చూడొచ్చు. Just Slogout, Slogout Classicలను ఎంచుకోవచ్చు. జెస్ట్ స్లాగౌట్ డెమోపై క్లిక్ చేయగానే ప్రత్యేక పేజీలో గేమ్ ఓపెన్ అవుతుంది. ఫుల్ వెర్షన్‌ను ఆడాలనుకుంటే Register కావాల్సిందే. మీ జట్టు, ప్రత్యర్థి జట్టుని, ఆడాలనుకునే గ్రౌండ్‌ని, ఓవర్ల పరిధిని నిర్ణయించి ఓకే చేస్తే సరి. క్రీజులోకి వెళ్లిపోవచ్చు. తెరకు కింది భాగంలో change View ద్వారా గ్రౌండ్ వ్యూ మార్చుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ కమ్యూనిటీలో Today's Top Players జాబితాలో ఎవరెవరు ఎక్కువ స్కోరు చేశారో తెలుసుకోవచ్చు. http://slogout. cricinfo.com
ఇది టెస్ట్ సిరీస్
ఎక్కువ సేపు సాధన చేస్తూ టెస్ట్ సిరీస్ ఆడాలనుందా? అయితే, nPower Cricket Game ఆడొచ్చు. 12 ఓవర్ల మ్యాచ్. జుట్టులో 10 సభ్యులున్నా ఏకైక బ్యాట్స్‌మెన్ మీరే! ఇక కీబోర్డ్‌లోని బాణం గుర్తుల కీలతో ఆట మొదలెట్టొచ్చు. లెఫ్ట్, రైట్ కీలతో కుడి, ఎడమ వైపులకు జరుగుతూ బౌలర్ వేసిన బంతిని Uparrow కొట్టాలి. లైవ్ క్రికెట్ మాదిరిగా ఎప్పటికప్పుడు స్కోర్ చూడొచ్చు. సిక్స్, ఫోర్ కొడితే ప్రేక్షకులు భలే గోల చేస్తారు. మీరు అవుట్ అయినా అరుస్తారు మరి. సులువైన ఫ్లాష్ బేస్డ్ గేమ్‌గా దీన్ని రూపొందించారు. http://cricket.npower.com/web/play_ the_cricket_game/index.htm
సిక్స్‌లు కొట్టండి
బౌలర్ పిచ్‌పై ఎక్కడ బౌన్స్ వేస్తాడో తెలిస్తే? దానికి తగ్గట్టుగా బ్యాట్స్‌మెన్ కదులుతూ సిక్స్‌లు, ఫోర్‌లు కొడితే? Super Sixers క్రికెట్‌కు ఉన్న ప్రత్యేకత అదే. సైట్‌లోని Click Here 2 Start పై క్లిక్ చేయగానే బ్యాట్స్‌మెన్, ఫీల్డర్లు, బౌలర్ సిద్ధంగా కనిపిస్తారు. పిచ్ మధ్యలో కనిపించే బాక్స్ ఆధారంగా బ్యాట్స్‌మెన్‌ను జరుపుతూ షాట్‌లు కొట్టొచ్చు. బ్యాట్స్‌మెన్‌ను జరపడానికి బాణం కీలను, బౌలింగ్, బ్యాటింగ్‌కి స్పేస్‌బార్ వాడాలి. దీంట్లో బౌలర్ పిచ్‌పై ఎక్కడ బౌన్స్ చేస్తాడో బాక్స్ మార్క్ ద్వారా ముందే తెలుసుకోవచ్చు. www.gamesjockey.com/play-1819-super-sixers.html
బౌన్సర్లు వేయండి
మీరు మంచి బౌలరా? పథకం ప్రకారం బౌలింగ్‌తో బ్యాట్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టేలా చేయాలంటే Bodyline ఆటను ఆడేయండి. బ్యాట్స్‌మెన్ చుట్టూ ఉన్న బాక్స్‌ని గమనిస్తూ దాంట్లోని లైన్స్ ఆధారంగా బాడిలైన్ బౌలింగ్ చేయవచ్చు. అందుకు స్పేర్‌బార్‌ను ఉపయోగించాలి. మీరు వేసే బౌలింగ్‌కు బ్యాట్స్‌మన్ గాయపడడం, కుప్పకూలి పడిపోవడం, స్ట్రెచ్చర్‌పై తీసుకుకెళ్లడం కూడా దీంట్లో చూడొచ్చు. www.games2win.com/en/ cricket/play-bodyline.asp
'గల్లీ' క్రికెట్
వీధుల్లో ఇటుకలు పేర్చి, డబ్బాలు నిలబెట్టి క్రికెట్ ఆడడం మీకు గుర్తుందా? ఆ గల్లీ క్రికెట్ ఆడాలంటే www.games2win. com/en/cricket/play-gully_cricket.asp లింక్‌లోకి వెళ్లాలి. మౌస్ పాయింటర్‌తో క్లిక్ చేస్తూ బ్యాటింగ్ చేయొచ్చు.
స్కూల్ పుస్తకాలతో..
చిన్నప్పుడు తరగతి గదిలో పుస్తకాన్ని బ్యాట్‌గా పట్టి ఆడిన క్రికెట్ గుర్తుందా? ఆ 'స్కూల్ క్రికెట్' ఆడుతూ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలంటే ఇదిగో మార్గం. http://cricket.zapak. com/cricket-school-cricket-games-post-1084-11-42-php
మరికొన్ని...
* www.games2win.com/en/cricket/play-cricket_championship_2008.asp
* www.flashcricket.com
* w ww.coverdrivecricket.com
*http://howzat.com/play/
*www.games2win.com/en/cricket/play-turbo_ cricket.asp
*http://fantasy.cricinfo.com
*http://games.sify.com/casual-games/cricket-57-71/ipl-cricket-588-71/play.html