స్టీల్ ఉత్పత్తుల ధరలు మళ్లీ పెరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ధరల పెరుగుదల అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గత నెలలో స్టీల్ ధరలకు టన్నుకు 2,000-2,500 రూపాయల మేరకుపెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో టన్ను స్టీల్ (రాడ్లు, షీట్లు) సుమారు 100 డాలర్లు మేరకు పెరిగింది. స్టీల్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో వచ్చే నెల 1వ తేదీ నుంచి స్టీల్ ధరలను పెంచాలని దేశీయ స్టీల్ కంపెనీలు నిర్ణయించినట్లు తెలిసింది.
గత నెలన్నర కాలంలో అంతర్జాతీయ మార్కె ట్లో స్టీల్ ధరలు టన్నుకు 5,000 రూపాయలకు పైగా పెరిగింది. దీనికి తోడు ముడి ఇనుము, కోకింగ్ కోల్ ధర 22 శాతం దాకా పెరిగింది, మరింత పెరిగే అవకాశం ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో స్టీల్ ధరలను పెంచటం మినహా మరో మార్గంలేదని స్టీల్ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తుల ధరలు టన్నుకు 2,500 రూపాయల మేరకు, పెరగవచ్చునని, అదే విధంగా లాంగ్ ఉత్పత్తులు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.