Tuesday, March 2, 2010

3 నుంచి హైదరాబాద్‌లో ఎయిర్‌ షో

3 నుంచి హైదరాబాద్‌లో ఎయిర్‌ షో
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ ప్రదర్శనకు వేదిక కానుంది. మార్చి 3 నుంచి 7 వరకు ''ఇండియా ఏవియేషన్‌ 2010'' పేరిట ఎయిర్‌ షోను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు ఫిక్కీ ప్రతినిధి వివేక్‌ తెలిపారు. బేగంపేట విమానాశ్రయం ఇందుకు వేదికగా నిలవనుంది. పౌర విమానయాన రంగానికి చెందిన సుమారు 200 కంపెనీలు ఈ ఎగ్జిబిషన్‌కు రానున్నాయి. 18 దేశాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాలుపంచుకోనున్నాయి. ఈ కార్యక్రమానికి భాగస్వామ్య దేశంగా ఫ్రాన్స్‌, ఫోకస్‌ కంట్రీగా అమెరికా వ్యవహరించనున్నాయి. ఈ రెండు దేశాలకు చెందిన 23 ప్రముఖ విమానయాన సంస్థలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. 40 రకాల విమానాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు.