Tuesday, March 2, 2010

ఫిక్కీ కొత్త అధ్యక్షుడిగా రాజన్‌ మిట్టల్‌

ఫిక్కీ కొత్త అధ్యక్షుడిగా రాజన్‌ మిట్టల్‌
న్యూఢిల్లీ: ఫిక్కీ అధ్యక్షుడిగా భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌-ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) రాజన్‌ భారతీ మిట్టల్‌ ఎంపికయ్యారు. శనివారమిక్కడ జరిగిన ఫిక్కీ 82వ ఏజీఎం ముగింపు సమావేశంలో ఆయనను ఈ పదవికి ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న హర్ష్‌పతి సింఘానియా స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. హార్వర్డ్‌ పూర్వ విద్యార్థి అయిన మిట్టల్‌ కంపెనీల కార్పొరేట్‌ వ్యవహారాలను పర్యవేక్షించడంలో క్రియాశీలంగా పనిచేస్తారనే పేరుంది.