3.5 శాతం పెరిగిన విమాన ఇంధన ధరలు
3.5 శాతం పెరిగిన విమాన ఇంధన ధరలు న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్- ఏటీఎఫ్) ధరలను తాజాగా 3.5 శాతం మేరకు పెంచివేశాయి. ఫలితంగా న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధరలు కిలో లీటరుకు రూ.1,325 అధికమై, ఒక్కో కి.లీ. రూ.39,307కు చేరుకొంటున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు ఆదివారమిక్కడ తెలిపారు. కాగా ముంబయిలో కిలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.1,380 పెరిగి రూ.40,547కు ఎగబాకుతుంది. చమురు సంస్థలు గత నెల 1న 5.5 శాతం, 16న 2.5 శాతం చొప్పున ఏటీఎఫ్ ధరలను తగ్గించటం గమనార్హం. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంచుమించు 40 శాతం ఏటీఎఫ్‌కే సరిపోతోంది. తాజా ధర పెంపు తో ఈ భారం తడిసిమోపెడు కానుంది.