స్త్రీలకు ప్రత్యేక రాయితీలు!
స్త్రీలకు ప్రత్యేక రాయితీలు!
జెట్ ఎయిర్‌వేస్ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' కానుక న్యూఢిల్లీ:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జెట్ ఎయిర్‌వేస్ ఈ నెలలో మహిళలకు ఛార్జీల్లో రాయితీలతో పాటు పలు ప్రయోజనాలను కల్పించనుంది. మార్చి 1నుంచి 10వ తేదీల మధ్య ప్రయాణాలు బృందాల్లో కనీసం ఒక మహిళ గనుక ఉంటే వారికి దేశీయ రూట్లలోని ప్రాథమిక ఛార్జీల్లో 10 శాతం, అంతర్జాతీయ ప్రయాణ ఛార్జీల్లో 5 శాతం రాయితీ కల్పించనున్నట్లు సంస్థ వివరించింది. ఇందుకోసం వారు విధిగా సంస్థ వెబ్‌సైట్లో తమ ప్రయాణాలను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సౌకర్యం జెట్ ఎయిర్‌వేస్, జెట్ ఎయిర్‌వేస్ కనెక్ట్ విమాన సర్వీసుల్లోని అన్ని మొదటి, ప్రీమియర్/ ఎకానమి తరుగతులకు వర్తిస్తుంది. దీనితో పాటు మహిళా ప్రయణికులకు పలు ఇతర ప్రయోజనాలనూ కల్పించనుంది. జెట్‌వివా కార్యక్రమంలో భాగంగానే సంస్థ ఈ ప్రత్యేక పథకాలను చేపట్టింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అతిథులకు తగిన చేయూతనిస్తూ వారు మేటిగా నిరూపించుకొనేందుకు తగు విధంగా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.