Wednesday, March 24, 2010

మన చేతుల్లోకి... ఐఫోన్ 3జియస్ వచ్చేస్తోంది!

యాపిల్ ఐఫోన్ 3ఎట మరింత వేగం, మెరుగైన ఫీచర్లతో ప్రపంచ వ్యాప్తంగా ఇది సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా విడుదలైన పది నెలల తరువాత ఇప్పుడు మన దేశంలో ఈ ఫోన్ అధికారికంగా విడుదల కానుంది. వచ్చే ఒకట్రెండు నెలల్లో ఈ ఫోన్ భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్‌లో 2ఎ, 3ఎ వెర్షన్‌లు ఎయిర్‌టెల్, ఒడాఫోన్‌ల ద్వారా చాలా కాలంగా భారత మార్కెట్‌లో లభిస్తున్నప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి త్వరలో రాబోతున్న యాపిల్ ఐఫోన్ 3ఎట పైనే ఉంది. విశేషం ఏమిటంటే.. ఐఫోన్ 3ఎటను ఈసారి ఓపెన్ మార్కెట్‌లో విక్రయించాలని యాపిల్ కంపెనీ తలపోయడం.
navya. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, భారత్‌కి వచ్చేసరికి దాని అమ్మకాలు అంతగా లేకపోవడానికి ప్రధాన కారణం.. దాన్ని తయారు చేసిన యాపిల్ కంపెనీ వ్యూహాత్మక తప్పిదమే.

నోకియా, ఎల్‌జి, సామ్‌సంగ్, సోనీఎరిక్సన్ తదితర కంపెనీల మాదిరిగా ఓపెన్ మార్కెట్‌లోకి రాకుండా, కేవలం తన యాపిల్ స్టోర్స్ ద్వారా అమ్మకాలు సాగించడం, దాంతోపాటుగా సెల్యులార్ సేవలు అందించే ఒకట్రెండు కంపెనీల(ఒడాఫోన్, ఎయిర్‌టెల్)తో భాగస్వామ్యం కుదుర్చుకుని, ఆయా నెట్‌వర్క్ కనెక్షన్ ఉన్న వారికి మాత్రమే యాపిల్ ఐఫోన్‌లను అందుబాటులోకి తీసుకురావడం ఐఫోన్ పాలిట శాపమైంది.

అయితే భారత వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో విఫలమైన యాపిల్ కంపెనీ చాలా తొందరలోనే తన పొరపాటు ఏమిటో తెలుసుకుంది. దీంతో చేసిన తప్పును దిద్దుకునే బాట పట్టింది. దాని ఫలితమే.. తాజాగా భార్‌తో విడుదల చేయనున్న ఐఫోన్ 3ఎటను ఓపెన్ మార్కెట్‌లో విక్రయించాలని భావించడం.

ఓపెనే కానీ..
వచ్చే ఒకట్రెండు నెలల్లో భారత్‌లో విడుదల కానున్న ఐఫోన్ 3ఎట ఇతర కంపెనీల ఫోన్ల మాదిరిగానే అన్ని సెల్‌ఫోన్ల దుకాణాలలో లభిస్తుంది. ఇంతకుముందులా యాపిల్ అధీకృత విక్రయ కేంద్రం 'ఐస్టోర్'లో మాత్రమే కొనాలన్న రూలేమీ లేదు. అలాగే ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ లేదా ఒడాఫోన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన సిమ్ కార్డులే వాడాలనీ లేదు. మీ ఇష్టం.. ఏ నెట్‌వర్క్‌కు సంబంధించిన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్‌కార్డులైనా అందులో వేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఓ చిన్న మెలిక ఉంది.

ఐఫోన్ 3ఎట హ్యాండ్‌సెట్ కొన్న వారు మొట్టమొదట ఏ నెట్‌వర్క్‌కు సంబంధించిన సిమ్‌కార్డు ఉపయోగించి ఫోన్‌ను యాక్టివేట్ చేయించుకుంటారో, అదే నెట్‌వర్క్‌ను ఏడాది పాటు కచ్చితంగా వినియోగించాలి. ఏడాది లోపల తమ సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చకూడదు. మధ్యలో ఇతర నెట్‌వర్క్‌లకు సంబంధించిన సిమ్ కార్డు వాడితే ఆటోమేటిక్‌గా ఫోన్ లాక్ అయిపోతుంది.

ఇప్పటి వరకూ..
ఆగస్టు 2008లో ఐఫోన్ 3ఎ హ్యాండ్‌సెట్ భారత్‌లో అధికారికంగా విడుదలైంది. మార్కెట్ అంచనాల ప్రకారం.. యాపిల్ ఐఫోన్‌కు భారత్‌లో అధీకృత పంపిణీదారులైన ఎయిర్ టెల్, ఒడాఫోన్ కంపెనీలు రెండూ కలిసి ఇప్పటి వరకు దాదాపు 30 వేల ఐఫోన్ 3ఎ హ్యాండ్‌సెట్‌లను విక్రయించగలిగాయి. ఇక యాపిల్ తాజా సంచలనం ఐఫోన్ 3ఎట విషయానికొస్తే.. గత ఏడాది జూన్‌లో ఈ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

భారత్‌కు ఇది అధికారికంగా రాకపోయినా, ఇక్కడి గ్రే మార్కెట్(అనధికారిక)లో చాలా కాలంగా ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఇప్పటి వరకు ఐఫోన్ 3ఎ, 3ఎట రెండు వెర్షన్‌లు కలిపి ఎనభై వేల నుంచి లక్ష హ్యాండ్‌సెట్‌ల వరకు ఒక్క గ్రే మార్కెట్ ద్వారానే అమ్ముడయి ఉంటాయని సమాచారం.

బహుముఖ పోటీ..?
ఇప్పటి వరకు భారత్‌లో యాపిల్ ఐఫోన్‌ల విక్రయ అధికారం ఎయిర్‌టెల్, ఒడాఫోన్‌లకు మాత్రమే సొంతం. కానీ ఇక మీదట ఈ రెండు కంపెనీల నియంత్రణ ఎంతో కాలం సాగదని యాపిల్ కంపెనీ తాజా వ్యూహం స్పష్టం చేస్తోంది. త్వరలో భారత్‌లో విడుదల కానున్న ఐఫోన్ 3ఎట హ్యాండ్‌సెట్‌ల విక్రయ అధికారం ప్రస్తుతం భారత్‌లో సెల్యులార్ సేవలు అందిస్తున్న మరికొన్ని కంపెనీలకు కూడా విస్తరించనుంది. యాపిల్ కంపెనీ తన తాజా వ్యూహంలో భాగంగా ఇతర కంపెనీల వైపు కూడా దృష్టిసారించడంతో.. ఐఫోన్ 3ఎట విక్రయాల రేసులో మరిన్ని కంపెనీలు పోటీ పడనున్నాయి. ఎయిర్‌టెల్ గత వారం ఐఫోన్ 3ఎట విక్రయాలకు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఆ కంపెనీ వెబ్ సైట్‌లోనూ ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు దర్శనమిస్తున్నాయి. భారత్‌లో విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించకపోయినా.. ఐఫోన్ 3ఎట విక్రయాలకు సంబంధించిన కాంట్రాక్టును గతంలో మాదిరిగానే చేజిక్కించుకునేందుకు ఎయిర్‌టెల్ అన్ని రకాలా సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత మెరుగ్గా..
గతంలో విడుదలైన ఐఫోన్ 3ఎ హ్యాండ్‌సెట్‌తో పోల్చుకుంటే.. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 3ఎట మరింత మెరుగైనదనే చెప్పాలి. 16, 32 గిగాబైట్‌ల సామర్థ్యంతో.. నలుపు, తెలుపు రంగుల్లో లభించనున్న ఈ ఫోన్‌లో మరికొన్ని అధునాతన ఫీచర్లు కొత్తగా వచ్చి చేరాయి. 3 మెగా పిక్సెల్ విత్ ఆటో ఫోకస్ కెమెరా, 7.2 మెగాబైట్స్ పర్ సెకను వేగంతో కూడిన ఇంటర్నెట్ సదుపాయం, వీడియో రికార్డింగ్, వాయిస్ కంట్రోల్, బిల్టిన్ డిజిటల్ కంపాస్‌లతోపాటుగా బ్యాటరీ బ్యాకప్ సమయం కూడా పెరిగింది. మెసేజ్‌లు, నోట్స్ రాసుకునేటప్పుడు వీలుగా ఇందులోని క్యూవెర్టీ కీబోర్డును ఫోన్‌ను తిప్పడం ద్వారా.. అడ్డంగా, పెద్దగా వచ్చేలా మార్చుకోవచ్చు.

అదే పెద్ద పితలాటకం!
యాపిల్ ఐఫోన్ 3ఎట - అంతా బాగానే ఉంది కానీ.. ధర దగ్గరికి వచ్చేసరికి మాత్రం భారత వినియోగదారులు ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటి వరకు భారత్‌లో ఐఫోన్ 3ఎట ధర ఇంతని యాపిల్ కంపెనీ ప్రకటించకపోయినా ఇదమిద్దంగా 16 జిబి సామర్థ్యం కలిగిన ఫోన్ ధర రూ.33,000గా.. 32 జిబి సామర్థ్యం కలిగిన ఫోన్ ధర రూ.42,000గా ఉండవచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంతకన్నాఅధిక ఫీచర్లు కలిగి ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్‌లు దేశీయ మార్కెట్‌లో అతి తక్కువ ధరకు లభిస్తుండగా, ఇంత ధర చెల్లించి యాపిల్ ఐఫోన్ 3ఎటను ఎవరు కొంటారో మరి! పోనీ ఇప్పటికే యాపిల్ ఐఫోన్‌లు ఉన్న వారు తమ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే సదుపాయం అయినా ఉందా..అంటే అదీ లేదు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే భారత వినియోగదారుల అంతరంగ తరంగాలను యాపిల్ కంపెనీ ఇప్పటికీ గుర్తించకపోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం!

navya. ఆన్‌లైన్‌లో 'అన్‌లాకింగ్'!
'తాడిని తన్నే వాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు మరొకడుండడం..' అంటే ఇదే! గ్రే మార్కెట్‌కు, నకిలీలకు అడ్డుకట్ట వేయాలనే భావనతో తాను తయారు చేసే ఐఫోన్ హ్యాండ్‌సెట్‌లను ముందుగానే 'లాక్' చేసి, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోఅధీకృత పంపిణీదారుల చేతుల మీదుగా విక్రయిస్తున్నా.. తీరా బయటికొచ్చాక వాటి బంధనాలు ఇట్టే బద్ధలవుతున్నాయి. చాలా దేశాలలో చాలామంది ఐఫోన్ 'లాక్డ్' వెర్షన్ తక్కువ ధరకు గ్రే మార్కెట్‌లో కొనుక్కొని ఆ తరువాత కొంత డబ్బు పడేసి దాన్ని 'అన్‌లాక్' చేయించుకుంటున్నారు.

లాక్డ్ వెర్షన్ ఐఫోన్‌లను అన్‌లాక్ చేసే సౌలభ్యం ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఉంది. ఠీఠీఠీ.ఠnజూౌఛిజుజ్కీజిౌn్ఛ.ౌటజ అనే వెబ్‌సైట్‌లోకి వెళితే చాలు. మీ ఫోన్ ఏ వెర్షన్ అయినా సరే, జస్ట్ 23 డాలర్లు (మన కరెన్సీలో రూ.1,050) మీవి కావనుకుంటే చాలు, ఓ సాఫ్ట్‌వేర్ సాయంతో, కొన్ని సూచనలు పాటించడం ద్వారా మీ ఐఫోన్ అన్‌లాక్ అయిపోతుంది. అంతేకాదు, ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు దీన్ని వన్ టైం ఫీజుగా మాత్రమే తీసుకుంటారు. ఆనక మీ ఇష్టం.. ఎన్ని ఐఫోన్‌ల సంకెళ్లనైనా మీరు క్షణాల్లో తెంచేసుకోవచ్చు. భలే ఉంది కదూ!