Tuesday, March 2, 2010

యునైటెడ్‌ బ్యాంక్‌ ఐపీఓ జారీ ధర రూ.66

యునైటెడ్‌ బ్యాంక్‌ ఐపీఓ జారీ ధర రూ.66
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు సంబంధించి ఒక్కో షేరు జారీ ధరను రూ.66గా నిర్ణయించారు. ఇష్యూ ధరల శ్రేణి రూ.60-66 కావటం గమనార్హం. ఈ ఇష్యూ 33 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌కు నోచుకొన్న సంగతి తెలిసిందే. 5 కోట్ల షేర్ల విక్రయం ద్వారా మొత్తం 324.98 కోట్లు బ్యాంకు సేకరించినట్లవుతోంది. రిటైల్‌ మదుపరులు, అర్హత గల ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.3 చొప్పున డిస్కౌంట్‌ను అందించనున్నట్లు యునైటెడ్‌ బ్యాంకు ఆదివారమిక్కడ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఓ ద్వారా ఇచ్చే షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో నమోదు చేయనున్నారు.