ఆఖరు త్రైమాసికంలో9% వృద్ధి
ఆఖరు త్రైమాసికంలో9% వృద్ధి
రంగరాజన్ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ సుమారు 9 శాతం మేరకు వృద్ధి చెందవచ్చని ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు సి.రంగరాజన్ అన్నారు. అక్టోబరు- డిసెంబరు మధ్య కాస్తంత తగ్గిన జీడీపీ వృద్ధి రేటును ఇది కొంత పూడ్చగలుగుతుందని, మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరం 7.2 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆయన విశ్లేషించారు. డిసెంబరుతో ముగిసిన మూడు నెలలకు జీడీపీ వృద్ధిరేటు 6 శాతానికి తగ్గిన విషయం విదితమే. ఒక వార్తాసంస్థ ప్రతినిధితో రంగరాజన్ మాట్లాడుతూ పారిశ్రామిక వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, రబీ పంట దిగుబడులు బాగుండే ఆస్కారం ఉందన్నారు.