Monday, March 22, 2010

బిజినెస్‌ గారడీలు

* కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు
ఇలా షేరు కొన్నాడో లేదో.. అలా బోనస్‌ షేర్లు వచ్చిపడ్డాయ్‌.

* ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ
మూసేసే కంపెనీకి వాటాదార్లు ఎక్కువ.

* ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట
కంపెనీ షేరు కొనలేడు కానీ.. ఏకంగా కంపెనీయే కొనేస్తాట్ట.

* ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు అడిగాట్ట.
అసలే స్టాక్‌ మార్కెట్లో నష్టమొచ్చి ఏడుస్తుంటే.. పక్కింటాయన అప్పు అడిగాట్ట.

* ఇల్లు అలకగానే పండగ కాదు.
షేరు కొనగానే కోటీశ్వరుడు అయిపోయినట్లు కాదు.