Tuesday, March 2, 2010

వేల కొలువులకు ఒకే పరీక్ష!

వేల కొలువులకు ఒకే పరీక్ష!
వి. జగదీశ్వర్‌
ఎకడమిక్‌ ఆఫీసర్‌, కళాశాల విద్యాశాఖ
కేంద్రప్రభుత్వ ఉద్యోగాలంటే ఉద్యోగార్థుల్లో ఎంతో ఆకర్షణ! ఈ నియామకాలు కూడా నిర్దిష్ట కాలవ్యవధికి పెట్టింది పేరు. పరిపాలనా సంస్కరణల కమిషన్‌ పుణ్యమా అని ఇవి మరింత పకడ్బందీగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఉమ్మడి పరీక్ష నిరుద్యోగుల్లో ఆశలను చిగురింపజేస్తోంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే ఈ పరీక్ష తీరుతెన్నులు తెలుసుకుందామా?
తంలో నిర్వహిస్తుండిన ఐదు రకాల పరీక్షలకు ప్రత్యామ్నాయంగా 'కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామినేషన్‌-2010' కొత్తగా తెరమీదకు వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే... వేలాది కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి పరీక్ష అవటం! కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌, టాక్స్‌ అసిస్టెంట్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ ఇన్‌ సెంట్రల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-II, కంపైలర్స్‌ పరీక్షలను రద్దు చేసి, వాటికి బదులుగా ఈ పరీక్షను కొత్తగా ప్రవేశపెట్టారు.

ఇన్ని రకాల పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయటం, ఫీజు చెల్లించటం, జిరాక్స్‌ కాపీలు జతచేయటం, వేర్వేరుగా ప్రతి పరీక్షకూ శిక్షణ తీసుకోవటం... ఇలాంటి సమస్యల నుంచి అభ్యర్థులకు విముక్తి కల్పిస్తూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా డిగ్రీస్థాయి పోటీ పరీక్షలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్టయింది.

నియామకాల ప్రక్రియను హేతుబద్ధమైన కాలవ్యవధిలో పూర్తిచేయాలని కేంద్రప్రభుత్వం నియమించిన రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్‌ (2nd ARC) సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా 'కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌-2010' ప్రకటన జారీ అయింది. 11-12 నెలల్లోనే ఈ నియామక ప్రక్రియ ముగించబోతున్నారు. గతంలో అయితే, దీనికి రెండేళ్ళ వ్యవధి పట్టేది.

ఈ ప్రకటనలో పేర్కొన్న ఉద్యోగాలు: అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ (సెంట్రల్‌ ఎక్సైజ్‌), ఇన్‌స్పెక్టర్‌ (ఇన్‌కంటాక్స్‌), ఇన్‌స్పెక్టర్‌ (ప్రివెంటివ్‌ ఆఫీసర్‌), ఇన్‌స్పెక్టర్‌ (ఎగ్జామినర్‌), అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (సీబీఐ), సెక్షన్‌ ఆఫీసర్‌ (ఆడిట్‌), డివిజనల్‌ ఎకౌంటెంట్‌, ఆడిటర్‌, అకౌంటెంట్‌, యూడీసీస్‌, టాక్స్‌ అసిస్టెంట్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీపీఓస్‌), సెక్షన్‌ ఆఫీసర్‌ (కమర్షియల్‌ ఆడిట్‌), ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-II & III, కంపైలర్‌ పోస్టులు.

మన అభ్యర్థుల స్థానం?
కేంద్రప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షల విజేతల్లో మన రాష్ట్రం వాటా స్వల్పమే. 2008-09లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ దేశవ్యాప్తంగా 6028 మందిని ఎంపిక చేయగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి కేవలం 182 మంది ఎంపికయ్యారు. అదే ఉత్తరభారతంలోని రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ ల (ఐదు రాష్ట్రాలు) నుంచి 4124 మంది ఎంపికయ్యారు. ఇందుకు ప్రధాన కారణం పరీక్షలు హిందీలో జరగడం వారికి అనుకూలమవడమే.

నూతన పరీక్షా విధానంలో హిందీ భాషపై ప్రశ్నలు లేవు. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ ప్రవేశపెట్టారు. ఇది మన రాష్ట్ర అభ్యర్థులకు అవకాశాలను మెరుగుపరుస్తుంది. ప్రణాళికాబద్ధంగా చదివితే సులభంగా ఏదో ఒక ఉద్యోగం పొందవచ్చు.

కొత్త విధానం: ముఖ్యాంశాలు
అన్ని ఉద్యోగాలకూ ఒకే దరఖాస్తుఫారం సమర్పించాలి. దరఖాస్తుఫారంలోనే తాము ఇష్టపడే ఉద్యోగాల ప్రాధాన్యక్రమాన్ని పేర్కొనాలి. తర్వాత ఈ క్రమాన్ని మార్చటం కుదరదు.

పరీక్ష మూడు అంచెలుగా (Tier I, Tier II , Tier III) ఉంటుంది.

* మొదటి అంచె: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతి)
ఇది వడపోత లాంటిది. ఇందులో నెగ్గినవారిని రెండో అంచె పరీక్షకు అనుమతిస్తారు.

* రెండో అంచె: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతి)
* మూడో అంచె: పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌ (ప్రజలతో సంబంధాలు ఉండే ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది.)
ఈ పరీక్షలు డిగ్రీ స్థాయి (standard)లో ఉంటాయి. దేశవ్యాప్త మెరిట్‌ లిస్టు తయారుచేసి ఒక సంవత్సర కాలంపాటు అమల్లో ఉంచుతారు.

టాక్స్‌ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలకు కంప్యూటర్‌పై స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు. అభ్యర్థులు గంటకు 8,000 కీ డిప్రెషన్స్‌ టైపు చేయగలగాలి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులు తుది ర్యాంకింగ్‌కు ఉపయోగపడవు.

ఈ నూతన విధానం అభ్యర్థులకూ, ప్రభుత్వానికీ, మంత్రిత్వశాఖలకూ ప్రయోజనకరమే. నియామక ప్రక్రియ త్వరగా ముగిసి వెంటనే ఉద్యోగంలో చేరటానికి అవకాశం కలుగుతుంది. అభ్యర్థులు వివిధ పరీక్షల కోసం వెచ్చించే సమయం, శిక్షణ వ్యయం ఆదా అవుతాయి.

ఆన్‌లైన్‌ కూడా దరఖాస్తు చేయవచ్చు. ఇలా చేసేవారు ఎస్‌బీఐ ద్వారా ఫీజు చెల్లించాలి.

ఎవరు అర్హులు?
మార్చి 2 నాటికి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
* స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ ఉద్యోగానికి డిగ్రీలో స్టాటిస్టిక్స్‌/మ్యాథ్స్‌/ఎకనమిక్స్‌/కామర్స్‌ లలో ఒక సబ్జెక్టు చదివివుండాలి.
* కంపైలర్‌ ఉద్యోగానికి డిగ్రీలో ఎకనమిక్స్‌/స్టాటిస్టిక్స్‌/మ్యాథ్స్‌లలో ఒక సబ్జెక్టు చదివివుండాలి.

ముఖ్యమైన తేదీలు
* దరఖాస్తు చేయటానికి చివరితేదీ: మార్చి 2
* టైర్‌I పరీక్ష తేదీ: మే 16
* టైర్‌II పరీక్ష తేదీ: జులై 31, ఆగస్టు1
ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం వెబ్‌సైట్‌: http://ssconline. nic.in

* ఫీజు రూ.100. మహిళా అభ్యర్థులకూ, ఎస్‌సీ, ఎస్‌టీ, ఎక్స్‌ సర్వీస్‌మన్‌లకు ఫీజు చెల్లింపులో పూర్తి మినహాయింపు ఉంది.
* మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం

తొలి అంచె (టైర్‌-I ) పరీక్ష చాలా ముఖ్యమైనది. ఇది వడపోత పరీక్షలాంటిది. కమిషన్‌ వివిధ కేటగిరీల వారీగా కనీస కటాఫ్‌ మార్కు నిర్ణయిస్తుంది. దీని ద్వారా రెండో అంచెకు చేరినవారికి తుది ర్యాంకింగ్‌లో టైర్‌-I మార్కులను కూడా కలుపుతారు. అందుకే అభ్యర్థులు సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు సాధించే కృషి చేయాలి.

జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌:దీనిలో అభ్యర్థి సహేతుక ఆలోచనా విధానాన్ని పరీక్షిస్తారు. వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ (బొమ్మలు) అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. మార్కెట్లో లభించే ప్రామాణిక పోటీ పరీక్షల పుస్తకాలు, మేధకు పదునుపెట్టే పజిల్స్‌ చదవాలి. శకుంతలాదేవి 'పజిల్స్‌ టు పజిల్‌ యు' లాంటి పుస్తకాలు చదవాలి. సిలబస్‌లోని అనాలజీస్‌, సిమిలారిటీస్‌, డిఫరెన్సెస్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, అనాలిసిస్‌, డెసిషన్‌ మేకింగ్‌, విజువల్‌ మెమరీ, అరిథ్‌మెటిక్‌ రీజనింగ్‌, నంబర్‌ సిరీస్‌లాంటివి చదవాలి. నాన్‌ వెర్బల్‌ సిరీస్‌, కోడింగ్‌ డీకోడింగ్‌ లాంటివి సాధన చేయాలి.

పరీక్ష హాల్లో ఆందోళనకు గురికాకుండా పరీక్షపై మనసు కేంద్రీకరిస్తే 50కి 50 మార్కులు సాధించటం కష్టం కాదు. దానికోసం ప్రయత్నం చేయాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌:పరిసర పరిస్థితులపై అభ్యర్థికి అవగాహన ఉందా, సమాజంపై ఈ పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకున్నాడా లేదా అని పరీక్షిస్తారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిణామాలపై ప్రశ్నలు ఉంటాయి. భారతదేశం, సరిహద్దు దేశాలకు సంబంధించిన చరిత్ర- సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, క్రీడాంశాలపై, భారత రాజ్యాంగంపై సిద్ధమవ్వాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, పత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాసాలు ఉపయోగపడతాయి.

న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌: సంఖ్యలను సరైన పద్ధతిలో ఉపయోగించగలిగే సామర్థ్యాన్ని ఇందులో పరీక్షిస్తారు. హోల్‌ నంబర్స్‌, డెసిమల్‌, ఫ్రాక్షన్స్‌, రిలేషన్‌ షిప్‌, నంబర్లు లెక్కించడం, అంచనా, కంప్యుటేషనల్‌ విధానాలు ఉంటాయి. ప్రశ్నలన్నీ అరిథ్‌మెటిక్‌ మూల సూత్రాలపై ఆధారపడివుంటాయి. పరీక్ష 10+2 స్థాయిలో ఉంటుంది. హైస్కూలు పుస్తకాలు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పాత ప్రశ్నపత్రాలు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: అభ్యర్థి ఆంగ్లభాషను సరిగా అర్థం చేసుకోగలగడం, ఈ భాషలో రాయగలిగే సామర్థ్యం చూపటం దీనిలో ప్రధానం. రెన్‌ అండ్‌ మార్టిన్‌ గ్రామర్‌ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. గత పరీక్షల ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే వాటి స్థాయి తెలుస్తుంది.

కేంద్రపోలీస్‌ సంస్థల్లోని ఎస్‌.ఐ. ఉద్యోగాల అభ్యర్థులు కేవలం పేపర్‌-II ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ మాత్రమే రాయాలి. మూడో అంచె ఇంటర్వ్యూ, శారీరక పరీక్షలకు వీరు తప్పనిసరిగా హాజరవ్వాలి.

పేపర్‌-I అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీస్‌, పేపర్‌-II ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ పేపర్లను అన్నిరకాల ఉద్యోగాల అభ్యర్థులూ తప్పనిసరిగా రాయాలి.

సెక్షన్‌ ఆఫీసర్‌ (కమర్షియల్‌ ఆడిట్‌), ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌ II, III, కంపైలర్‌ ఉద్యోగాల అభ్యర్థులు పేపర్‌-I, II, III మూడు పరీక్షలూ విధిగా రాయాలి.

మూడో అంచె పరీక్ష- ఇంటర్వ్యూ:
డివిజనల్‌ అకౌంటెంట్లు, ఆడిటర్‌, అకౌంటెంట్‌, యు.డి.సి., టాక్స్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల అభ్యర్థులు మినహా మిగతా అందరూ తప్పనిసరిగా ఇంటర్వ్యూ పరీక్షకు హాజరవ్వాలి. దీనికి 100 మార్కులు