Wednesday, May 5, 2010
స.హ.చట్టం పరిధిలోకి ఎక్స్ఛేంజీల ఉత్తర్వులపై స్టే
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీలు సమాచార హక్కు చట్టంపరిధిలోకి వస్తాయంటూ ఇటీవల సింగిల్ జడ్జి బెంచ్ వెలువరించిన ఆదేశం అమలుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. తాత్కాలిక చీఫ్ జెస్టిస్ మదన్ బి. లోకుర్ నేతృత్వంలోని ధార్మసనం ఏప్రిల్ 15న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుపై స్టే మంజూరు చేసింది. ప్రభుత్వ డబ్బులతోగానీ, సర్కారు నియంత్రణలో గానీ స్టాక్ ఎక్స్ఛేంజీలు పనిచేయడం లేనందున సమాచారచట్టం కింద ఇవి విధిగా సమాచారం వెల్లడించాలని ఒత్తిడి తేవద్దని ఎన్‌ఎస్‌ఈ చేసుకున్న విజ్ఞప్తి మేరకు మదన్ బి.లోకుర్ నేతృత్వంలోని బెంచ్ స్టే మంజూరు చేసింది. ఎక్సేంజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు కావని, వీటికి సర్కారు నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదన్న విషయాన్ని ప్రధానంగా గమనించాలని ఎన్‌ఎస్‌ఈ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ గట్టిగా వాదించారు. ఎక్స్ఛేంజీలు సమాచారచట్టం పరిధిలోకి వస్తాయని ఉత్తర్వునిస్తూ ఏకసభ్య ధర్మాసనం తప్పు చేసిందంటూ ఆయన తన వాదన వినిపించారు.