ఆదిలాబాద్ (ఆన్‌లైన్) ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలోని 1998లో మూతపడిన ఇండియా సిమెంట్ కార్పొరేషన్ (సిసిఐ) పరిశ్రమను పరిశీలించడానికి సోమవారం కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ బృందాన్ని పంపింది. ఈ బృందం ఐదు రోజుల పాటు ఇక్కడ ఉండి పరిశ్రమ తెరవటానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
ఈ బృందానికి అజయ్ నాయకత్వం వహిస్తుండగా పంకజ్, సందీప్, ప్రదీప్‌లు సభ్యులుగా ఉన్నారు. 1982లో భూమి పూజ జరిగి రెండేళ్లలో నిర్మాణం పనులు పూర్తి చేసుకొని 1984లో అప్పటి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌డి తివారీ చేతుల మీదుగా ఈ సిమెంట్ పరిశ్రమ ప్రారంభమైంది.