Tuesday, May 4, 2010

త్వరలో పెట్రో ధరలకు రెక్కలు ?

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌తో సహా పెట్రో ఉత్పాదనల ధరలపై నియంత్రణను ఎత్తి వేసే అంశంపై త్వరలో మంత్రులతో కూ డిన ఉన్నతాధికార కమిటీ ఓ నిర్ణ యం తీసుకోనుంది. పార్లమెంట్‌ ప్రస్తు త స మావేశాల అనంతరం ఈ కమిటీ సమా వేశం కానుంది. వంటగ్యాస్‌తో పాటు పెట్రోలు, డీజిల్‌ రేట్లపై ప్రభుత్వ నియం త్రణ నుంచి తొలగించే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. ప్రస్తుతం పెట్రోల్‌ ను లీటర్‌కు 6. 63 సబ్సిడీతో, డీజిల్‌ను రూ. 6.25 సబ్సిడీతో విక్రయిస్తున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మంత్రుల సాధికారిక కమిటీ కేవలం పెట్రోలు ధరలపై మాత్రమే నియంత్రణను ఎత్తివేయాల్సిందిగా సూచించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

డీజిల్‌, వంట గ్యాస్‌ల ధరలను స్వల్పంగా మాత్రమే పెంచే అవకాశం ఉందని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంట్‌ ప్రస్తుత సమావేశాలు ఈ నెల 7వ తేదీతో ముగియనున్నాయి. పెట్రో ఉత్పాదనలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేయా లని గనుక మంత్రుల సాధికారిక కమిటీ భావించినట్లయితే, ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ల ఉత్పత్తి వ్యయం, అమ్మకం ధరల మధ్య రూ. 6 తేడా మేరకు ధరలు పెరిగే అవకాశం ఉంది.

మంత్రుల కమిటీకి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షత వహిస్తారు. దిగుమతి చేసుకున్న ధరల కన్నా తక్కువగా రేట్లకు పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌లను విక్రయిస్తున్నందుకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 90,150 కోట్ల మేరకు నష్టాలను చవిచూడవచ్చని అంచనా. దేశ అవసరాలను తీర్చుకునేందుకు మనం ప్రధా నంగా ముడిచమురు దిగుమతులపైనే ఆధారపడినట్లు చమురు మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మార్చి నెల నుంచి కూడా అంతర్జాతీయంగా వీటి రేట్లు పెరగడం ఆరంభమైనట్లు పేర్కొన్నారు. పరిస్థితిని ఎలా ఎదుర్కో వాలనే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.