హైదరాబాద్: నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మకాలు జరుపుతున్న వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఎకై్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దాడులను ముమ్మ రం చేస్తోంది. గత ఏడాది కంటే ఎక్కువ కేసులు నమోదుచేసి ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లను పూర్తిచేసేందుకు ఎన్‌ఫోర్స్ మెంట్ యంత్రాంగం చేస్తున్న చర్యలపై మద్యం వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. తాము నిర్వహించే మద్యం అమ్మకాలన్నీ ప్రత్యక్షంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టేందుకేనన్న విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తిం చాలనేది వైన్స్ నిర్వాహకులు, మద్యం వ్యాపారుల వాదన. రాష్ట్ర ఆదాయ మార్గాల్లో మద్యం విక్రయాల పాత్ర ప్రధానంగా ఉండ డంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ దూకుడు పట్ల ఆబ్కారీ శాఖ అధికారులు సైతం కలవరపడుతున్నారు.
నిబంధనలను అతిక్రమించినప్పుడే ఎన్‌ఫోర్స్‌మెంట్ జోక్యం చేసుకుంటుందే తప్ప అనవసర వివాదాలను కోరితెచ్చుకోమన్నది ఎన్‌ఫోర్స్‌మెంట్ యంత్రాంగం వాదన. నిర్ణీత ధర(ఎమ్మార్పీ)లకు మించి మద్యం అమ్మ కాలు సాగించడం, వైన్ షాపుల పరిసరాల్లోనే మద్యం సేవించేందుకు వీలైన ఏర్పాట్లు చేయ డం, వైన్ షాపుల్లో డిస్పోజబుల్ గ్లాసులు, నీటి సాచెట్లను వి్రయించడం, నిర్ణీత వేళలకు మించి అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరపడం వంటి వాటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదనే రీతిలో సంబంధిత యంత్రాంగం సన్నద్ధమైంది.
ఆబ్కారీ శాఖకు మద్యం అమ్మకాలపై టార్గెట్ ఉన్నట్లుగా ఎన్ ఫోర్స్‌మెంట్‌కు కూడా కొన్ని టార్గెట్లు ఉన్నాయనే విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదా వరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, వరంగల్, మెదక్, మహబూ బ్‌నగర్, కర్నూలు వంటి జిల్లాల్లో మద్యం వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతునట్లు, ఈ జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారుల్లో కొం దరు ఎకై్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్లను, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసి స్టెంట్ కమిషనర్ల స్థాయి అధికారులపై పెత్తనం చేసే రీతిలో వ్యవ హరిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌వద్ద నివేదికలు కూడా ఉన్నట్లు సమాచారం.
మద్యం వ్యాపారులకు రాజకీయనేతల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల అధి కారులు సైతం సర్దుకుపోతున్నా రు. కఠినంగా విధులు నిర్వ హిస్తే ఉన్నతాధికారుల నుంచి ప్రశం సలు రాకపోగా అభిసంశనలు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. దీంతో వారితో పెట్టుకుంటే తమ పోస్టులకు ముప్పు వస్తుందనే భీతితో సర్దుబాటు ధోరణితో నెట్టుకొస్తున్నవారు కూడా ఆబ్కారీ యంత్రాంగంలో ఉన్నారు. మరో రెండు నెలల్లో ఆబ్కారీ సంవత్సరం పూర్తి కానున్న నేపధ్యం లో మద్యం విక్రయాలను పెంచుకుని లాభాలు ఆర్జించేందుకు మద్యం వ్యాపారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నరనే అభిప్రాయం ఉంది.
వైన్ షాపులో మద్యం కొనుగోలు కోసం వచ్చిన వారు తమ వినియోగదారుడని, అతని పట్ల గౌరవ భావంతో వ్యవహరిం చాలన్న ఆలోచన లేకుండా వైన్స్ నిర్వాహకులు దురుసుగా ప్రవ ర్తించడం అన్ని చోట్ల సర్వసాధారణమైంది. మద్యం కొనుగోలు దారులందరూ తాగుబోతులుగా, తృతీయ శ్రేణి పౌరులు అనే తీరులో వైన్ షాపు నిర్వాహకులు వ్యవహారశైలి ఉంటుంది. ఈ ఒక విధంగా మద్యం వినియోగదారుల హక్కులను వైన్స్ నిర్వా హకులు, మద్యం వ్యాపారులు హరించివేయడమే అవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఎకై్సజ్‌శాఖ కనీస ప్రయత్నాలు కూడా చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అదే ఒక కిరాణాషాపులో వినియోగదారుడు అడు గుపెట్టగానే ‘ఏమి కావాలి సార్’ అని షాపు నిర్వాహకులు అడిగి తెలుసుకుని మరీ సరుకులు అందజేయడం అందరికీ తెలిసిందే. ఇలాంటి వాతావరణాన్ని వైన్ షాపు నిర్వాహకులు, మద్యం కొను గోలుదారుల మధ్య నెలకొల్పేందుకు ఆబ్కారీ శాఖ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని మద్యం వినియోగదారులు కోరుతున్నారు.