న్యూఢిల్లీ: ఫ్రెంచ్‌కు చెందిన ఆటోమోబైల్ దిగ్గజం రీనాల్ట్, దేశీయ బజాజ్ ఆటో సంస్థతో అల్ట్రా లో కాస్ట్ (యూఎల్‌సి) వాహన కారును నిస్సాన్‌తో కలిసి రూపొందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సుమారు 2,500 డాలర్ల విలువైన (రూ.1.10లక్ష) చవకైన కారును ఉత్పత్తి చేసి దేశీయ మార్కెట్లో టాటా నానో కారుకు పోటీని ఇవ్వనున్నాయి. దేశీయ మార్కెట్‌లో రీనాల్ట్, నిస్సాన్ సంయుక్తంగా కలిసి బజాజ్ గ్రూప్‌తో అను బంధంగా చవకైన కారును ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, 2500 డాలర్లుగా ఈ కారు ధర ఉండబోతుందని రీనాల్ట్ ప్రెసిడెంట్, సీఈఓ కార్లస్ ఘోస్ సంస్థ వార్షిక సమావేశం సందర్భంగా తెలిపారు. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో అంగీకరించదగ్గ ధర కానుందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు.
ఈ సంవత్సరమే యూఎల్‌సి కారును దేశీయ మార్కెట్లోకి విడుదల చేసేందు కు ప్రణాళిక రచించినా, ఈ నిర్ణయాన్ని 2012 నాటికి వాయిదా వేసుకున్నారు. టాటా నానో కారుకు గట్టి పోటీని ఇచ్చేందకు వ్యూహాత్మకంగా యూఎల్‌సి కారు ధరను రూ.1.10లక్షలుగా నిర్ణ యించారు. నానో ధర ప్రస్తుతం మూడు వేరియంట్లలో రూ.1.23లక్షల నుంచి 1.72లక్షల వరకూ ఉంది. మూడు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కారు డిజైనింగ్, ఇంజనీరింగ్, రూపకల్పన, ఉత్పత్తి పనులను బజాజ్ ఆటో సంస్థ చేపట్టనుండగా, మార్కెటింగ్, విక్రయాల కార్యక్రమాలను రీనాల్ట్-నిస్సాన్ సంస్థలు నిర్వహించనున్నాయి. మారుతీ సుజుకీ కన్నా చిన్న తరహాలో కారు మోడల్ ఉండనుందని అధికారుల చెబుతున్నారు. ఇంత చవకైన ధరలో యూఎల్‌సి కారును ఉత్పత్తి చేసేందుకు మూడు ఆటో సంస్థలు ఇంజ నీరింగ్ సొల్యూషన్స్‌ను వెతికేందుకు తంటాలు పడుతున్నాయి.