మూడీస్, ఫిచ్, ఎస్&పీ.. ఇవన్నీ రేటింగ్ ఏజెన్సీలు. తరచూ వివిధ దేశాలకు, కంపెనీలకు రేటింగ్‌లను ఇస్తూ ఉంటాయి. తాజాగా భారత్ రేటింగ్‌ను పెంచినట్లు ఎస్&పీ తన పేర్కొంది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం..? ఇదో ప్రధాన ప్రశ్న.

* కొంత మంది పెట్టుబడిదారులు తమ నిబంధనలను సడలించుకుని పరిధికి మించి పెట్టుబడులు పెట్టడానికీ ఈ రేటింగ్‌లు ప్రేరేపించే అవకాశం ఉంది.
* దేశీయ పెట్టుబడిదారుల కోణంలో చూస్తే మాత్రం వాళ్లకు ఈ రేటింగ్‌ల వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. విదేశీ పెట్టుబడుదారులకు మాత్రం భారత ఆర్థిక వ్యవస్థపై మరింత విశ్వాసం పెరుగుతుంది.
* ఇది భారత మార్కెట్లకు నిధుల ప్రవాహాన్ని పెంచుతుంది. బ్యాంకులు, కార్పొరేట్లకు తక్కువ వడ్డీకే విదేశీ రుణాలు మంజూరవుతాయి. దేశీయంగా కూడా ఈ దిశగా కొంత ప్రభావం ఉంటుంది.
* అంతర్జాతీయ మార్గాల ద్వారా కార్పొరేట్లు నిధుల సమీకరణకు మొగ్గుచూపడం దేశీయ బ్యాంకులపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
* భారత మార్కెట్లకు అదనపు పోర్ట్‌ఫోలియో నిధులు పెరిగే అవకాశాలున్నాయి.
* అయితే కొంత మంది విశ్లేషకులు మాత్రం కేవలం రేటింగ్ పెరగడం వల్ల భారత కంపెనీలు, బ్యాంకులకు విదేశీ రుణాలు చౌకగా దొరుకుతాయని భావించలేమంటున్నారు. అంతర్జాతీయ స్థిరీకరణపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడింగులు
రుణ స్వీకర్త(ప్రభుత్వాలు, కంపెనీలు)లకు సాధారణంగా ఎస్&పీ ఏఏఏ నుంచి డి దాకా రేటింగులు ఇస్తూంటుంది. ఏఏ, సీసీసీ మధ్య బీబీబీ+, బీబీబీ, బీబీబీ- వంటి మధ్యంతర రేటింగులు సైతం ఇస్తుంది. కొందరు రుణస్వీకర్తలకు రేటింగ్ పెంచే అవకాశం ఉందనీ, లేదా తగ్గించే అవకాశం ఉంటుందని కూడా సూచిస్తుంటుంది.

ఏఏ: నాణ్యత గల రుణ స్వీకర్తలు. ఏఏఏ కంటే కొంచెం నష్టభయం ఉన్నవారు.
ఏ: ఆర్థిక పరిస్థితులు నిధులపై ప్రభావాన్ని చూపొచ్చు.
బీబీబీ: మధ్య శ్రేణి రుణస్వీకర్తలు(జంక్ బాండ్లుగా ప్రసిద్ధం).
బీబీ: ఆర్థిక వ్యవస్థలో మార్పులకు కుంగే అవకాశాలెక్కువ.
బీ: ఆర్థిక పరిస్థితులు తరచూ మారుతూ ఉంటాయ్.
సీసీసీ: ప్రస్తుతానికి బలహీనం. అనుకూల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
సీసీ: అధిక బలహీనం, అధిక అస్థిరత్వ బాండ్లు
సీ: అధిక బలహీనం, దివాళా లేదా అప్పుల్లో ఉండి చెల్లింపులు తీర్చే సామర్థ్యం ఉండడం
సీఐ: వడ్డీ బకాయిలున్న పరిస్థితి
ఆర్: ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండడంతో నియంత్రణాధికార సంస్థల నేతృత్వంలో ఉన్నవి.
ఎస్‌డీ: కొన్ని అప్పులు చెల్లించకుండా ఉండడం
డి: అప్పులేవీ చెల్లించలేని స్థితి
ఎన్‌ఆర్: రేటింగ్ లేనివి
గమనిక: ఈ రేటింగ్ ఏజెన్సీ స్వల్పకాలిక ఇష్యూ రేటింగ్‌లనూ ఇస్తుంది. ఇవి ఎ-1 నుంచి డి దాకా ఉంటాయి.