Saturday, March 20, 2010

లేమన్‌ బ్రదర్స్‌ కుంభకోణంపై ముందే హెచ్చరించాం

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనడానికి గల ప్రధాన కారణమైన లేమన్‌ బ్రదర్స్‌ కుంభ కోణంపై ముందే హెచ్చరించామని మెరిల్‌ లించ్‌ తెలిపింది. అమెరికా ఆర్థిక నియంత్రిత వ్యవస్థలైన సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్‌, ఫెడరల్‌ రిజర్వ్‌లకు ఈ విషయమై కొద్ది నెలల ముందే హెచ్చరించినట్టు ఓ మీడియా కథనం. ఈ కుంభకోణ ప్రణాళికలో భాగస్వాములైన వారి గురించి అమెరికా వార్తా సంస్థ ఫైనాన్షి యల్‌ టైమ్స్‌ పలు విష యాలను వెల్లడించింది. అమెరికా ఎస్‌ఈసీతో పాటు ఫెడరల్‌ రిజర్వ్‌ అధికారులను లేమన్‌ బ్రదర్స్‌ బ్యాలెన్స్‌ షీట్‌పై మెరిల్‌ లించ్‌ 2008 మార్చి లోనే హెచ్చరించిందని పేర్కొంది.

పోటీ నెలకొల్పేందుకు లేమన్‌ బ్రదర్స్‌ చేసిన లావాలదేవీలపై మెరిల్‌ లించ్‌ అధికారులు రెగులేటర్లను సంప్రదించా రని వెల్లడించింది. లేమన్‌ సంస్థ కన్నా మెరిల్‌ లించ్‌ ఆర్థికంగా బలహీనంగా ఉందని పెట్టుబడి దారులు, ట్రేడింగ్‌ పార్ట్‌నర్లు తమపై ఒత్తిడి తీసుకువచ్చారని మెరిల్‌ లించ్‌ అధికారులు తెలిపినట్టుగా రిపోర్టు పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా మెరిల్‌లించ్‌ సంస్థ మాజీ అధికారులు 2008 సంవత్సరంలో లేమన్‌ కుంభకోణానికి ముందే నియంత్రణ అధికారులను లిశారని తెలిపింది. పెట్టుబడి పార్టీలను ఆకర్షించేందకు లేమన్‌ సంస్థ తమ ఆదాయాలను తప్పుగా చూపించిందనీ, అగ్రస్థానంలో ఉన్నట్టు నమ్మబలికిందని, ఇందులో మెరిల్‌ లించ్‌ను కూడా ఉద్దేశించిందనీ మీడియా రిపోర్టు తెలిపింది.