న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కల లు ఫలించేలా ఉన్నాయి. 3జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా భారీఎత్తున నిధులు సమకూరగలవని ఆయన ఆశించారు. ఆయన ఆశలకు తగ్గట్టు గానే వివిధ టెలికాం సంస్థలు 3జీ స్ప్రెక్టమ్, వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ సేవలు అందించేందుకు క్యూ కట్టాయి. భారతి, వోడాఫోన్, ఆర్‌కామ్, టాటా లాంటి సంస్థలన్నీ బరిలోకి దిగాయి. దేశ వ్యాప్త 3జీ స్పెక్ట్రమ్ కోసం రూ.3,500 కోట్లు రిజర్వు ధరగా కేంద్రం నిర్ణయించింది. బ్రాడ్ బాండ్ వైర్లెస్ యాక్సెస్ (బీడబ్ల్యూఏ) సేవల కోసం రూ. 1,750 కోట్లను రిజర్వు ధరగా నిర్ణయించింది. 3జీ స్పెక్ట్రమ్ వేలం ఏప్రిల్9న ఆరంభం కానుంది. తదనంతరం బీడబ్ల్యూఏ వేలం ప్రారంభమవుతుంది. రిజర్వు ధరలను బట్టి ఈ వేలం ద్వారా కేంద్రం రూ. 20 వేల కోట్లకు పైగా నిధులను పొందే అవకాశం ఉంది.
బరిలో పోటీకి దిగిన సంస్థలు ఎక్కువగా ఉండ డంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దేశవ్యాప్త స్పెక్ట్రమ్‌ను కేంద్రం మూడు సంస్థలకు విక్రయించనుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం నాలుగు సంస్థలను కూడా అనుమతించనున్నారు. పంజాబ్, బీహార్, పశ్చి మ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీ ర్‌లలో నాలుగు సంస్థలను 3జీ స్పెక్ట్రమ్‌లో అనుమతించనున్నారు. బీడబ్ల్యూఏలో మాత్రం ఒక్కో బ్లాక్ రెండు స్లాట్‌లు మాత్రమే ఉంటాయి. భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఆర్‌కామ్, టాటా, ఐడియా సెల్యులార్‌లు ఇటు 3జీతో పాటుగా అటు బీడబ్ల్యూఏకు కూడా పోటీపడు తున్నాయి. దరఖాస్తుల దాఖలుకు చివరితేదీ శుక్రవారంతో ముగిసిపోయింది.
ఇటిసాలట్, వీడియోకాన్‌లు 3జీ స్పెక్ట్రమ్‌కు మాత్రమే బిడ్ దాఖలు చేశాయి. అ మెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, టి కోనా, సై్పస్‌లు మాత్రం వైర్లెస్ రంగానికే బిడ్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్ సెల్ 3జీ స్పెక్ట్రమ్ కోసం బిడ్ దాఖలు చేసినట్లు సమా చారం. బిడ్‌లో నెగ్గినవారికి సెప్టెంబర్ 1 నుంచి 3జీ వినియోగానికి అనుమతి లభించనుంది. బిడ్డర్ల ప్రీ క్వాలిఫికేషన్ మార్చి 30న జరుగనుం ది. ఏప్రిల్ 5,6 తేదీల్లో నమూనా వేలం, 9న వేలం జరుగనున్నాయి. కంటెంట్‌ను అతివేగం గా డౌన్ లోడ్ చేసుకునేందుకు 3జీ సేవలు ఉప కరిస్తాయి. యునినార్ మాత్రం బరిలోకి దిగ లేదు. తాము మరింతగా 2జీ స్పెక్ట్రమ్ వినియో గానికి డబ్బు చెల్లించినప్పటికీ, దాన్నే పొందలేక పోయామని యునిటెక్ ఎండీ స్టెయిన్ ఎరిక్ తెలిపారు. ఆయా సర్కిళ్ళలో సేవలను పటిష్ఠం చేయడంపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు.