కాల్సైన్డ్ కోక్ వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి అమెరికాలో హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా అమెరికా మార్కెట్ నుంచే ఈక్విటీ నిధులను సమీకరించాలన్నది కంపెనీ ఆలోచన. రుణభారాన్ని దించుకోవడానికి, అదే సమయంలో ఇతర కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) శ్రీనివాసరావు వివరించారు. ఇటీవలనే చైనాలో కూడా 20 వేల టన్నుల సామర్థ్యంగల సిపిసి ప్లాంట్‌ను కంపెనీ కొనుగోలు చేసింది.
దీనివల్ల సిపిసి ఉత్పత్తికి అవసరమైన కీలక ముడిపదార్ధం ఆనోడ్ గ్రేడ్ పెట్రోలియం కోక్ లభ్యతకు మార్గం లభించింది. రానున్న రోజుల్లో భారత్‌లో భారీ ఎత్తున అల్యూమినియం ప్రాజెక్టులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విశాఖలోని సిపిసి ప్లాంట్ విస్తరణ కూడా కంపెనీ ఎజెండాలో ఉంది. ప్రస్తుతం విశాఖలో ఉన్న 6 లక్షల టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ సమీపంలోనే 500 కోట్ల వ్యయంతో మరో 4 లక్షల టన్నుల సామర్థ్యంగల కొత్త ప్లాంట్ ఏర్పాటు అవకాశాలను కూడా రెయిన్ గ్రూప్ పరిశీలిస్తున్నది.
ప్రస్తుతం విశాఖలో ఉత్పత్తి చేస్తున్న సిపిసిలో 70 శాతం ఎగుమతి చేస్తుండగా 30 శాతం దేశీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కొత్త అల్యూమినియం ప్లాంట్ల వల్ల దేశీయ మార్కెట్‌లో సిపిసికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని శ్రీనివాసరావు తెలిపారు. అయితే విశాఖ ప్లాంట్ విస్తరణ 2011-12 తర్వాతనే ఉంటుందని ఆయన వెల్లడించారు.
Saturday, March 20, 2010
ఎందుకీ పునర్‌వ్యవస్థీకరణ ?
అమెరికా కంపెనీ కొనుగోలు కోసం రెయిన్ కమొడిటీస్ భారీగా రుణాలను సమీకరించింది. 2008 డిసెంబర్ నాటికి 3533 కోట్ల రూపాయలున్న రుణ భారం 2009 డిసెంబర్ నాటికి 2696 కోట్ల రూపాయలకు తగ్గింది. ఈ మొత్తాన్ని కూడా తగ్గించుకోవడంపై కంపెనీ దృష్టిసారించింది.